ఇలాచీ టీ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. రోజు తాగేస్తారు!

యాల‌కులు.వీటి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

యాల‌కులను ఇలాచీ అని కూడా పిలుస్తుంటారు.

సుగంధ ద్రవ్యాల్లో యాల‌కుల‌వి ప్ర‌త్యేక స్థానం అని చెప్పాలి.

స్వీట్స్‌, హాట్స్ రెండిటిలోనూ ఇలాచీని ఉప‌యోగిస్తారు.వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న అందించే ఇలాచీ.

ఆరోగ్య ప‌రంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.ముఖ్యంగా ప్ర‌తి రోజు ఒక క‌ప్పు ఇలాచీ టీ తాగితే.

Advertisement

బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ఒత్తిడి, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఈ రోజుల్లో చాలా కామ‌న్‌గా వ‌స్తుంటాయి.ఈ స‌మ‌యంలో చాలా మంది చేసే ప‌ని ట‌క్కున ఏదో ఒక మాత్ర‌ను వేసేసుకుంటారు.

కానీ, ఒక క‌ప్పుడు ఇలాచీ టీ తాగితే గ‌నుక‌.త్వ‌ర‌గా ఒత్తిడి, త‌ల‌నొప్పి, అల‌స‌ట స‌మ‌స్య‌ల నుంచి మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే ఈ వింట‌ర్ సీజ‌న్‌లో త‌ర‌చూ జ‌లుబు, తుమ్ములు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు వేధిస్తూ ఉంటాయి.అయితే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉండే ఇలాచీ టీ రోజుకో క‌ప్పు తీసుకుంటే.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

సీజ‌న‌ల్‌గా వ‌చ్చే స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

Advertisement

గుండె పోటు మ‌రియు ఇతర గుండె సంబంధిత జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంలో ఇలాచీ టీ స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, ఖ‌చ్చితంగా ప్ర‌తి రోజు ఒక క‌ప్పు ఇలాచీ టీ తాగ‌డం మాత్రం మ‌ర‌చిపోవ‌ద్దు.అలాగే చాలా మంది నోటి దుర్వాస‌న స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.

ఎన్ని ర‌కాల మౌత్ వాష్‌లు వాడినా.టూత్ పేస్ట్‌లు మార్చినా ప్ర‌యోజ‌నం లేకుంటే.చాలా బాధ ప‌డ‌తారు.

అయితే అలాంటి వారు రెగ్యుల‌ర్‌గా ఇలాచీ టీ సేవిస్తే.ఖ‌చ్చితంగా నోటి దుర్వాస‌న స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక ప్ర‌తి రోజు ఇలాచీ టీ తాగ‌డం వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన ప్ర‌యోజనం ఏంటంటే. జీర్ణ స‌మ‌స్య‌లు ముఖ్యంగా గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

భోజ‌నం చేసే గంట లేదు రెండు గంట‌ల ముందు ఇలాచీ టీ తాగితే.మ‌రింత మంచిది.

తాజా వార్తలు