అర్జున బెరడుతో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.. తెలుసుకోపోతే చాలా న‌ష్ట‌పోతారు!

అర్జున చెట్టు(తెల్ల మద్ది) నుంచి వ‌చ్చేదే అర్జున బెర‌డు.ఈ బెర‌డు తెలుపు, ఎరుపు రంగుల‌ను క‌ల‌గ‌లసి ఉంటుంది.

పూర్వ కాలం నుంచి ఆయుర్వేద వైద్యంలో ఎన్నో జ‌బ్బుల‌కు నివార‌ణిగా అర్జున బెర‌డును వినియోగిస్తున్నారు.ఈ బెర‌డులో ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా ఇది బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలను క‌లిగిస్తుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం అర్జున బెర‌డుతో ఏయే ఆరోగ్య లాభాలు ఉన్నాయో ఓ చూపు చూసేయండి.

ఎముక‌ల బ‌ల‌హీన‌త‌తో బాధ ప‌డే వారికి అర్జున బెర‌డు దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది.అర్జున బెర‌డును మెత్త‌గా పొడి చేసి.

Advertisement
Wonderful Health Benefits Of Arjuna Tree Bark Details! Arjuna Tree Bark, Arjuna

అందులో తేనె క‌లిపి రోజుకు పావు స్పూన్ చొప్పున తీసుకోవాలి.త‌ద్వారా బ‌ల‌హీన‌మైన ఎముక‌లు దృఢంగా మార‌తాయి.

అలాగే ప్ర‌స్తుత చ‌లి కాలంలో గోరు వెచ్చ‌టి పాల‌ల్లో అర్జున బెర‌డు పొడిని అర స్పూన్ చప్పున క‌లిపి తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

శ్వాసకోశ‌లో ఏమైనా అడ్డంకులు ఉంటే తొల‌గిపోతాయి.అదే స‌మ‌యంలో ఆస్త‌మా ల‌క్ష‌ల నుంచి కూడా విముక్తి ల‌భిస్తుంది.

Wonderful Health Benefits Of Arjuna Tree Bark Details Arjuna Tree Bark, Arjuna

సంతాన స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి.త‌ద్వారా లైంగిక స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌ట్టి.వీర్య క‌ణాల వృద్ధి జ‌రుగుతుంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

దాంతో సంతాన భాగ్యం క‌లిగే అవ‌కాశాలు పెరుగుతాయి.అంతే కాదు, అర్జున బెరడుతో కషాయాన్ని త‌యారు చేసుకుని త‌ర‌చూ తీసుకుంటే గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

Advertisement

ర‌క్త పోటు స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.క‌డుపు అల్స‌ర్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

మ‌రియు రోగ నిరోధ‌క శ‌క్తి కూడా అద్భుతంగా పెరుగుతుంది.

తాజా వార్తలు