మ‌హిళ‌ల ఆగ్ర‌హం.. మంత్రి అంబ‌టికి నిర‌స‌న సెగ‌

గ‌డ‌ప‌గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి అంబ‌టికి నిర‌స‌న సెగ త‌గిలింది.

ప‌ల్నాడు జిల్లా రాజుపాలెంలో నిర్వ‌హించిన కార్యక్ర‌మంలో పాల్గొన్న అంబ‌టిని కొంద‌రు మ‌హిళ‌లు, గ్రామ‌స్తులు నిల‌దీశారు.

దీంతో మంత్రి సైతం ఎదురు ప్ర‌శ్న‌లు సంధిస్తూ ముందుకు సాగిపోయిన‌ట్లు తెలుస్తోంది.వైసీపీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు గ‌డిచినా ఇప్ప‌టివ‌ర‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేదంటూ మంత్రి అంబ‌టిని మ‌హిళ‌లు నిల‌దీశారు.

త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.అర్హ‌త ఉన్న ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు అందడం లేదని, ఫించ‌న్లు రావ‌డం లేద‌ని మ‌హిళ‌లు వాపోయారు.

మంత్రి ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా.ఓ వ్య‌క్తి త‌మకు రోడ్డు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరాడు.

Advertisement

వెంట‌నే స్పందించిన అంబ‌టి టీడీపీ వారికి రోడ్లు ఎలా వేస్తామంటూ ప్ర‌శ్నించారనే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.ఓ దివ్యాంగురాలు పెన్ష‌న్ రావ‌డం లేద‌ని అడ‌గ్గా.

నాలుగు మీట‌ర్లు ఉన్న కార‌ణంగా ఫించ‌న్ ఆపేసినట్లు అధికారులు తెలిపారు.అనంత‌రం గ్రామ‌స్తులు వ‌రుస‌గా అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై నిల‌దీస్తుండ‌టంతో కోపోద్రిక్తుడైన మంత్రి ప‌ర్య‌ట‌న నుంచి వెనుదిరిగిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు