ఈ ఆడోళ్లు వారంతట వారే కిందపడి.. వెనుక బైకర్‌తో గొడవ.. వీడియో వైరల్!

చాలామంది ఆడవాళ్లు మగవారితో సమానంగా రోడ్లపై వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు.అయితే వీరిలో కొందరు ఆడవారు మాత్రం తమకు నచ్చినట్టుగా రోడ్లపై డ్రైవ్ చేస్తూ అందరికీ హడల్ పుట్టిస్తున్నారు.

 Women Falls From The Scooty Blames Biker Video Viral Details, Girls, Fall Down,v-TeluguStop.com

ఒక వైపు టర్నింగ్ తీసుకుంటూ మరొకవైపు సైన్ చేయడం, ఆగి ఉన్నవారికి డాష్ ఇవ్వడం వంటి వీడియోలు ఇప్పటికీ ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా ఈ కోవకు చెందిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో మహిళలు స్కూటీ పై నుంచి తామంతట తామే కింద పడి తమ, ఆపై తెలివిని ప్రదర్శించారు.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు మహిళలు ఒక స్కూటీపై వెళ్లడం గమనించవచ్చు.అయితే హైవేపై వారు ఒక్కసారిగా కింద పడటం కూడా గమనించవచ్చు.బహుశా డ్రైవ్ చేస్తున్న మహిళ ఫ్రంట్ బ్రేక్ సడన్‌గా వేసినట్టుంది.అందుకే స్కూటీ ఒక్కసారిగా జారి పడింది.

దీంతో వెనుక కూర్చున్న మహిళతో పాటు రైడర్ కూడా కింద పడింది.అయితే వెనుక కూర్చున్న మహిళ వెంటనే పైకి లేచింది.

మరోవైపు ఈ యాక్సిడెంట్ చూడగానే వెనకే వస్తున్న ఒక బుల్లెట్ బైకర్ బ్రేక్ వేసి అలాగే ఉండిపోయాడు.అయితే ఆ మహిళ అతన్ని చూసి “నీ వల్లే ఆక్సిడెంట్ అయ్యింది.

స్కూటీకి ఎందుకు డాష్ ఇచ్చావు? నడపడం రానప్పుడు పెద్ద బైక్స్ వేసుకొని రోడ్లమీదకు ఎందుకు వస్తారోయ్” అని ఆమె దుర్భాషలాడటం మొదలుపెట్టింది.

అదృష్టవశాత్తూ ఈ బైకర్‌ ఒక బాడీక్యామ్ అప్పటికే ఆన్ చేసి ఉంచాడు.ఇదే విషయాన్ని అతడు చెబుతూ.“నేనేం చేయలేదు.కావాలంటే బాడీక్యామ్ లో ఏం జరిగిందో చూడండి” అన్నట్లు వీడియో చూపించాడు.ఈ వీడియోలో ఆ బైకర్ తప్పేం లేదని స్పష్టంగా తెలుస్తోంది.ఈ మహిళలు వారంతట వారే కిందపడి వెనక వ్యక్తిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారని కూడా క్లియర్ గా కనిపించింది.దీంతో మరో మాట మాట్లాడకుండా ఆ మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

గతంలో కూడా ఆడవాళ్లు తామే తప్పుచేసి ఇతరులపై అభండాలు వేసిన ఘటనలు ఉన్నాయి.అయితే ప్రస్తుత ఘటనలో ఈ మహిళా షాక్‌లో ఉండి ఏం జరిగిందో తెలుసుకోలేక ఇలా మాట్లాడి ఉండొచ్చు.

ఏది ఏమైనా బాడీ కెమెరా వల్ల బైకర్ బతికి పోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube