ఓ వివాహిత అక్రమ సంబంధానికి( Illegal Relationship ) అడ్డుగా ఉండే భర్తను తొలగించుకుంటే తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని భావించి మరో మహిళ సహాయంతో భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది.ఈ ఘటన హైదరాబాద్లోని( Hyderabad ) జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు అరెస్టు చేయడంతో బెయిల్ పై బయటకు వచ్చి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి తిరిగి ఇంటికి వచ్చేది.కానీ హఠాత్తుగా శవమై కనిపించడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
పోలీసులు హత్య కేసు కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ నగరంలోని సూరారం విశ్వకర్మ కాలనీలో నివాసం ఉంటున్న సురేష్( Suresh ) అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం రేణుక( Renuka ) అనే మహిళకు వివాహం అయింది.వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.కొద్ది కాలం పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది.అయితే కుటుంబ కలహాల కారణంతో భర్తతో దూరంగా ఉంటూ, దుండిగల్ లోని ప్రైవేట్ పాఠశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిబాబాతో( Saibaba ) రేణుక సహజీవనం చేస్తోంది.అయితే తన అక్రమ సంబంధానికి భర్త ఎప్పటికైనా అడ్డే అనే భావించి రేణుక మరో మహిళ సహాయంతో ఫిబ్రవరి 6న భర్త సురేష్ ను అత్యంత దారుణంగా హత్య చేసింది.
ఆ కేసులో జైలుకు వెళ్లిన రేణుక ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది.

తాజాగా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి ఇంటికి వెళ్లిన రేణుక పనిమీద తిరిగి బయటకు వెళ్లి బంధం చెరువు కట్టపై( Bandham Cheruvu ) శవమై కనిపించింది.పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని రేణుక మృతుదేహంపై ఉండే గాయాలను చూసి ఇది హత్య కేసు అని తేల్చారు.రేణుక మొబైల్ ఫోన్ పరిశీలించగా ఆమె రేణుక భర్త సురేష్ తమ్ముడు నరేష్ తో మాట్లాడినట్లు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు చేస్తున్నారు.







