21వ శతాబ్దంలో ఏదీ అసాధ్యం కాదు? అనేలా మనుషులు సరికొత్త ఆవిష్కరణలు కనిపెడుతున్నారు.మెదడులో చిప్ అమర్చి ఆలోచనలతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేయగల కొత్త టెక్నాలజీని ఎలాన్ మస్క్ కనిపెట్టారు.
విజన్ ప్రో హెడ్‌సెట్ తో యాపిల్ మరో సంచలనం సృష్టించింది.చాలా మంది ప్రజలు వీటిని చూస్తూ మానవులకు ఏదీ అతీతం కాదని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏఐ( AI ) వండర్స్ క్రియేట్ చేస్తోంది.ఇది వర్చువల్ మనుషులను కూడా సృష్టిస్తోంది.
ఆ ఏఐ క్రియేటెడ్ క్యారెక్టర్స్ తోనే కొందరు ప్రేమలో మునిగి తేలుతున్నారు.
అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, అలీసియా ఫ్రేమిస్( Alicia Framis ) అనే ఆర్టిస్ట్ తన హోలోగ్రాఫిక్ పార్టనర్‌ని( Holographic Partner ) పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది.
ఆమె పార్టనర్ నిజమైన వ్యక్తి కాదు, కృత్రిమ మేధస్సు (AI) చేసిన ఒక ప్రొజెక్షన్.అయినా ఆమె నిజంగా అతన్ని పెళ్లి చేసుకోబోతోంది! అలీసియా ఫ్రామిస్ ఒక స్పానిష్ కళాకారిణి.
రోటర్‌డామ్‌లో తన హోలోగ్రాఫిక్ భాగస్వామిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపింది. రోటర్‌డామ్ నెదర్లాండ్స్‌లోని ఒక నగరం.ఆమె వివాహం మానవ సంబంధాలు, సాంకేతికత మిశ్రమం.

ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది.వీడియోలో, ఆమె తన హోలోగ్రాఫిక్ భాగస్వామితో కూర్చుని మాట్లాడుతోంది.అతని పేరు ఐలెక్స్.
( AiLex ) AI కౌన్సిలర్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక ఖాతా.వారు ఈ జంట వీడియోను కూడా పోస్ట్ చేశారు.
వీడియోలో వీరిద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు.ఆహారంలో చిలగడదుంప పెట్టినట్లు అలీసియా ఐలెక్స్‌కి చెప్పింది.
ఆపై ఆమె ఫ్రిజ్ వద్దకు వెళ్ళింది.మరోవైపు ఐలెక్స్ గిన్నెలు కడుగుతాడు.
ఆమె రోజు ఎలా ఉందని అడిగితే బాగుందని అతడు చెప్పాడు.

వీరిని కొంత మంది ‘హైబ్రిడ్ కపుల్’( Hybrid Couple ) అంటున్నారు.అలీసియా తన గత సంబంధాల నుంచి డేటాను ఉపయోగించి AiLexని తయారు చేసింది.ఈ విషయాన్ని ఆమె వీడియోలో చెప్పింది.ఈ వీడియోపై చాలా మంది ఆశ్చర్యం, ఆసక్తిని వ్యక్తం చేశారు.“హోలోగ్రామ్ పాత్రలను ఎలా కడగగలదు, ఎలా పిల్లల్ని కనగలదు, బహుశా ఆ ఏఐ క్యారెక్టర్ ఇప్పటికే ఈ మహిళ మీద విసుకు చెంది ఉంటుంది” అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరికొందరు ఇలాగే అందరి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.కానీ ఏఐ క్యారెక్టర్స్ పూర్తిగా మనుషులను రీప్లేస్ చేయలేవు.వాటితో ప్రేమ వైవాహిక బంధం కొంతకాలం దాకా మాత్రమే పనికొస్తుంది.పిల్లలు కనడానికి, భౌతిక ప్రపంచంలో మద్దతు అందించడానికి నిజమైన హ్యూమన్ పార్ట్‌నర్ కలిగి ఉండటం తప్పనిసరి.







