ఈ రొమాంటిక్ కథ సూపర్ మార్కెట్ బయట మొదలైంది.జాస్మిన్ షాపింగ్ కోసం అక్కడికి వెళ్లింది.
అప్పుడు ఆమె ఒక వ్యక్తిని చూసింది.అతని పరిస్థితి చూసి, జాటిపడిన జాస్మిన్ అతనికి కొంత డబ్బు ఇవ్వాలనుకుంది.
కానీ అతను ఆ డబ్బును తీసుకోలేదు. షాపింగ్ సమయంలో ఇదే విషయం జాస్మిన్ మదిలో మెదిలింది.
షాపింగ్ ముగించుకుని మాల్ నుంచి బయటకు రాగానే.ఆ వ్యక్తి ఆమెకు సామాన్లు మోయడంలో సహకరించాడు.
ఇది చూసి జాస్మిన్ ఆశ్చర్యపోయింది.డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం, జాస్మిన్ గ్రోగన్ తన టిక్‌టాక్ వీడియోలో ఇలా తెలిపింది.
నేను చాలా వస్తువులు తీసుకుని మాల్ నుండి బయటకు వస్తున్నప్పుడు, మెకాలీ నాకు సహాయం చేసాడు.ప్రతిఫలంగా నేను అతనిని డిన్నర్‌కు రమ్మని అడిగాను.
సంకోచంగానే మెకాలీ అంగీకరించాడు.విందు సమయంలో అతను తన జీవితం గురించి తెలిపాడు.
ఆ తర్వాత అతనితో టచ్‌లో ఉండేందుకు ఓ చిన్న ఫోన్ కొనిచ్చానని తెలిపింది.
ఇది మాత్రమే కాదు జాస్మిన్ నిరాశ్రయుడైన మెకాలీ కోసం హోటల్‌లో ఒక గదిని కూడా బుక్ చేసింది.
ఇంటికి రాగానే రాత్రంతా అతని గురించే ఆలోచిస్తూనే ఉంది.ఇద్దరూ మెసేజ్ ద్వారా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇద్దరూ లంచ్‌లో కలుసుకున్నారు.మధ్యాహ్న భోజనం తర్వాత జాస్మిన్.
మెకాలీకి కొన్ని దుస్తులు ఇచ్చి తన ఇంట్లోని ఒక గదిలో ఉండమని కోరింది.కొద్ది రోజుల్లోనే జాస్మిన్.
మెకాలీ తనకు సరైన భాగస్వామి అని భావించింది.ఒక రోజు జాస్మిన్ తన ప్రేమను అతని ముందు వ్యక్తం చేసింది.
మెకాలీ కూడా ఓకే చెప్పాడు.అప్పటి నుండి ఇద్దరూ కలిసే ఉంటున్నారు.
మెకాలే పెరిగిన గడ్డం గీసుకుని, మంచి దుస్తులు ధరించడం ప్రారంభించాడు.కొద్ది రోజులకు ఉద్యోగం సంపాదించిన తర్వాత, మంచి జీవితాన్ని గడపడం ప్రారంభించాడు.
ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.వారంతా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.