జలకన్యగా మారి ఆకట్టుకున్న యువతి.. ఊహించని ప్రమాదంతో ఊక్కిరిబిక్కిరి.. చివరికి..

ఒక్కోసారి ఊహించని మార్గాలలో మనల్ని మృత్యువు వెంటాడుతుంది.ఇలాంటి సందర్భాలలో కొందరు చేతులెత్తేస్తే మరికొందరు మాత్రం ఎలాగోలా ఆ ప్రమాదాల నుంచి బతికి బయట పడగలుగుతుంటారు.

 Woman Dressed As Mermaid Caught In Dangerous Situation Video Viral Details, Aqua-TeluguStop.com

మృత్యువు నుంచి తప్పించుకున్న అదృష్టవంతుల వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.తాజాగా ఆ కోవకు చెందిన మరో వీడియో ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఒక మహిళ జలకన్య వేషం ( Mermaid Costume ) వేసుకొని ఒక భారీ అక్వేరియంలోకి దిగి విజిటర్లను ఎంటర్‌టైన్‌ చేస్తోంది.అంతలోనే ఆమె కాస్ట్యూమ్ కింద ఇరుక్కుపోయింది, దాంతో పైకి వెళ్లలేక, ఊపిరి అందక ఊక్కిరిబిక్కిరి అయింది.

దక్షిణాఫ్రికాలోని( South Africa ) రాండ్‌బర్గ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్లో ఈ భారీ ఆక్వేరియాన్ని( Aquarium ) ఏర్పాటు చేశారు.సముద్ర అడుగుభాగాన్ని ఈ అక్వేరియంలోనే రీ క్రియేట్ చేశారు.అందులో కొన్ని జాతుల చేపలను కూడా విడిచిపెట్టారు.కొంతమంది యువతుల చేత జలకన్యల వేషం వేయించి, వారిని అందులోకి దింపి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.అయితే మత్స్యకన్య వేషం వేసిన ఒక యువతి కింద కాసేపు ఈత కొట్టింది.

తిరిగి పైకి వెళ్లాలనుకుంది కానీ అంతలోనే ఆమె కాస్ట్యూమ్ కింద విరుక్కుపోయింది.

పైకి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా ఆమె వెళ్లలేకపోయింది.అప్పటికే ఊపిరాడక ఆమె బాధపడుతోంది.అదే టైమ్‌లో ఆమెకు ఒక ఐడియా తట్టింది.

క్షణాల్లోనే కాస్ట్యూమ్ విడిచేసింది.ఆపై పైకి వెళ్లి మూత తీసేసింది.

అలా ఈ ప్రమాదం నుంచి బతికిపోయింది.సమయానికి ఆ ఆలోచన వచ్చింది కాబట్టి ఆమె చనిపోకుండా ప్రాణాలతో బయటపడింది.

లేదంటే అందులోనే జల సమాధి అయ్యుండేది.ఈ వీడియో లాస్ట్ లో ఆమె ఎస్కేప్ చూశాక చాలామంది ఊపిరి పీల్చుకున్నారు.

@BornAKang అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube