ట్రాన్స్‌ఫర్ అయిన రెండు వారాల్లోనే ఎన్నారై ఉద్యోగికి గూగుల్ షాక్..

భారతీయ సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన్మయ్( Tanmay ) సహాయ్ ఇటీవలే పదోన్నతి పొంది స్విట్జర్లాండ్‌కు( Switzerland ) బదిలీ అయ్యారు.అలా బదిలీ అయ్యారో లేదో రెండు వారాలకే గూగుల్ అతన్ని కొలువు నుంచి పీకేసింది.

 Within Two Weeks Of The Transfer, The Nri Employee Was Shocked By Google, Google-TeluguStop.com

నాలుగు సంవత్సరాలుగా టెక్ దిగ్గజంతో కలిసి ఉన్న సహాయ్, తన పరిస్థితిని పంచుకోవడానికి, కొత్త ఉద్యోగ అవకాశాల కోసం లింక్డ్‌ఇన్‌ను ఆశ్రయించారు.కస్టమర్ సంతృప్తిని మెరుగుపరచడానికి స్కేలింగ్ సిస్టమ్‌లు, ఆటోమేటింగ్ ప్రక్రియలతో సహా బ్యాకెండ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో తన అనుభవాన్ని హైలైట్ చేశారు.

సహాయ్ ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోనే కాకుండా ఎక్కడైనా ఉద్యోగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్( Alphabet ) 2023, జనవరిలో తన వర్క్‌ఫోర్స్‌ను 12,000కి తగ్గించే ప్రణాళికలను ప్రకటించగా.ఆ తొలగింపు విడతలోనే తన్మయ్ తొలగింపు జరిగింది.ఆల్ఫాబెట్ CEO, సుందర్ పిచాయ్, తన విచారం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయం పట్ల క్షమాపణలు చెప్పారు, తొలగింపులకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు.ఇకపోతే హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ( Indian Institute of Information Technology )లో కంప్యూటర్ సైన్స్ చదివిన తన్మయ్, జాబ్ లీడ్స్, రిఫరల్స్ కోసం తన లింక్డ్‌ఇన్ కనెక్షన్‌లను అభ్యర్థించారు.

స్కేలింగ్ సిస్టమ్స్‌లో, మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్‌లను మెరుగుపరచడంలో వాటిని మరింత సమర్థవంతంగా, నమ్మదగినదిగా చేయడానికి తన నైపుణ్యాలను ఉపయోగించాలని అతను ఆశిస్తున్నారు.ఇక తన్మయ్ గురించి తెలుసుకున్న చాలామంది అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.

ప్రమోషన్ వచ్చిన రెండు వారాలకే ఇలా జాబ్ కోల్పోవడం చాలా బాధాకరమని ఇంకొందరు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube