చాట్‌జీపీటీ సాయంతో 3 నెలలలో ఏకంగా రూ. 28 లక్షలు సంపాదించేశాడు!

ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ( ChatGPT ) ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతోంది.ఇది వచ్చిన తరువాత అపరిస్థితులు చాలా మారిపోయాయి.

 With The Help Of Chatgpt In 3 Months At Once Rs He Earned 28 Lakhs ,technology N-TeluguStop.com

చాలా మంది విద్యార్థులు తమ అసైన్‌మెంట్లను రాయడానికి చాట్‌జీపీటీ పైన ఆధారపడుతున్నారు.అంతేకాకుండా టీచర్లు దీనిద్వారా కొత్త పద్ధతుల్లో విద్యా బోధన చేస్తున్నారు.

ఇంకా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు, వేగంగా కోడింగ్ రాయడానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు( Software engineers )… ఇలా ఒక్కరేమిటి, కంటెంట్ రైటర్లు, వెబ్ డెవలపర్లు, ఫిలిం మేకర్లు ఇపుడు చాట్‌జీపీటీపైన ఆధారపడాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలోనే చాట్‌జీపీటీ ఆధారంగా లాన్స్ జంక్( Lance Junk ) అనే 23 ఏళ్ల కుర్రాడు ఏకంగా 3 నెలల కాలంలో రూ.28 లక్షల మేర సంపాదించాడు అంటే మీరు నమ్ముతారా? లాన్స్ ఆన్‌లైన్‌లో ఓ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారాన్ని ప్రారంభించాడు.15 వేల మంది విద్యార్థులు ఆ ప్లాట్‌ఫారంలో పేర్లను రిజిస్టర్ చేసుకోవడం విశేషం.ఇక లాన్స్ కాన్సెప్ట్ ఏంటంటే.చాట్ జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలో పిల్లలకు నేర్పించడమే అతని పని.ఆ కోర్సుకు కంప్లీట్ గైడ్ ఫర్ బిగినర్స్ అని నామకరణం చాయగా అలా మూణ్నెల్ల కాలంలో 35 వేల డాలర్లు అంటే సుమారుగా రూ.28.4 లక్షలు మేర అతగాడు సంపాదించాడు.

ఈ నేపథ్యంలో లాన్స్ ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.చాట్‌జీపీటీ లాంటి గొప్ప ఆటోమేషన్ టూల్‌ను ప్రతి ఒక్కరూ వాడుకునేలా తాను ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు.అయితే దీనికి ముందు అతగాడు చాట్‌జీపీటీపై పరిశోధన చేసాడట.

ఈ క్రమంలో నవలకు ఇంట్రో వంటివి రాయడం, కవితలు, కథలు, పాటలు రాయడం.ఇలా ఎన్నో అంశాలపై చాట్‌జీపీటీకి ప్రశ్నలను సంధించి, సమాధానాలు ఎలా వస్తున్నాయో తెలుసుకున్నాడట.

అలా ప్రోగ్రామింగ్ కోడ్‌లను కూడా అద్భుతంగా రాయగలదని తెలుసుకున్నాడట.దాంతో తన అనుభవంతో చాట్‌జీపీటీ గురించి ఈ ప్రపంచానికి ఎలాగన్నా చెప్పాలని అనుకున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube