PhonePe Google Pay : ప్రభుత్వం నిర్ణయంతో గూగుల్ పే, ఫోన్‌పేలకు భారీ ఊరట.. 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సంస్థలకు భారీ ఊరట కల్పించింది.30 శాతం మార్కెట్ క్యాప్‌కు కట్టుబడి ఉండటానికి గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది.జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ తాజాగా 30 శాతం మార్కెట్ క్యాప్‌కు గడువును రెండేళ్లు అంటే డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది.ప్రతి యూపీఐ థర్డ్-పార్టీ యాప్ 30 శాతం లావాదేవీల వాల్యూమ్ క్యాప్‌కు కట్టుబడి ఉండాలనే మార్గదర్శకాలు మొదట నవంబర్ 2020లో ప్రభుత్వం తీసుకొచ్చింది.

 With The Decision Of The Government, A Huge Relief For Google Pay And Phonepay ,-TeluguStop.com

తద్వారా కేవలం కొంతమంది ప్లేయర్‌ల చేతుల్లోనే యూపీఐ వాల్యూమ్‌ల ఉండకుండా నివారించాలని ప్లాన్ చేసింది.

ప్రస్తుతం ఇండియాలో ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం కంపెనీలు మంత్లీ యూపీఐ వాల్యూమ్‌లలో సుమారు 96 శాతం వాటా కలిగి ఉన్నాయి.

NPCI ద్వారా ముందుగా నిర్ణయించబడిన గడువు డిసెంబర్ 31, 2022, ఆ తర్వాత డిజిటల్ పేమెంట్ సర్వీస్ సంస్థలన్నీ నెలవారీ యూపీఐ వాల్యూమ్‌లలో 30 శాతం లేదా అంతకంటే తక్కువ వాటాను కలిగి ఉండాలి.దీనివల్ల కంపెనీల వ్యాపారం కాస్త దెబ్బ తినే అవకాశం ఉంది.

అయితే ఈ రూల్ అమలు కావడానికి 2 ఏళ్ల వరకు వాయిదా వేయడంతో కంపెనీలకు ఊరట కలిగినట్లు అయ్యింది.

Telugu Google Pay, Cap, Firms, Phonepe, Upi Volume-Latest News - Telugu

ఎన్‌పీసీఐ లేటెస్ట్ డేటా ప్రకారం, ఫోన్‌పే అక్టోబర్‌లో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల్లో 47.26 శాతానికి పైగా లావాదేవీలను ప్రాసెస్ చేసింది.గూగుల్ పే యూపీఐ ద్వారా దాదాపు 34 శాతం లావాదేవీలను ప్రాసెస్ చేసింది.

ఈ రెండు కంపెనీలు యూపీఐలో ప్రాసెస్ చేయబడిన మొత్తం లావాదేవీల వాల్యూమ్ పరంగా 81 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube