రాజమౌళి బ్రాండ్‌ ఇమేజ్ అక్కడి వరకే పని చేసిందా పాపం

రాజమౌళి బ్రహ్మాస్త్ర సినిమా ను సమర్పిస్తున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చిన సమయంలో అంతా కూడా ఆశ్చర్యను వ్యక్తం చేశారు.సినిమాలో ఏముందని రాజమౌళి అంతగా సమర్పించేందుకు ఓకే చెప్పాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తే.

 With Out Rajamouli Brand Brahmastra Get Good Collections , Alia Bhatt, Brahmastr-TeluguStop.com

మరి కొందరు మాత్రం భారీగా ఆయనకు డబ్బులు ఇస్తానన్నడం వల్లే సమర్పించేందుకు ముందుకు వచ్చి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమా విడుదల తర్వాత బ్రహ్మాస్త్ర సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో రాజమౌళిని విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు, కానీ అనూహ్యంగా సినిమా మంచి వసూలను సొంతం చేసుకుంది.ఇంకా కూడా భారీగా వసూలను రాబడుతూనే ఉంది.

400 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూలు నమోదయ్యాయి.ఈ సినిమాతో నిర్మాతలు భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని అంతా భావించారు.కానీ అనుహ్యంగా ఈ సినిమా రాజమౌళి కారణంగా బచాయించింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతలోనే జనాల మూడ్‌ అంతా మారింది అన్నట్లుగా తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు కనిపించకుండా పోయాయి.కానీ హిందీ బాక్సాఫీస్ వద్ద మాత్రం జోరుగా వసూళ్లను రాబడుతుంది.

హిందీలో కూడా ఈయన సమర్పించి ఉంటే బాగుండేది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ ఇక్కడ పెద్దగా వసూలు రాబట్టకున్నా వీక్‌ డేస్ ల్లో కూడా బ్రహ్మాస్త్ర సినిమాకు ఉత్తర భారతంలో కూడా మంచి వసూలు నమోదు అవుతున్నాయి.

అక్కడ పరిస్థితిని చూస్తుంటే 300 నుండి 350 కోట్ల రూపాయలను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇది నిజంగా బ్రహ్మాస్త్ర యొక్క గొప్పతనం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ కంటే కూడా బ్రహ్మాస్త్ర లో ఉన్న కంటెంట్ వల్లే ఈ స్థాయి వసూలు నమోదు అవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube