వైరల్.. ఇలా కూడా పెళ్లి చేసుకుంటారా..?

పెళ్లంటే నూరేళ్ళ పంట.జీవితంలో ఒక్కసారే జరిగే వైభవం.

జీవిత భాగస్వామితో వేసే ప్రతీ అడుగు ప్రత్యేకంగా ఉండాలని జంటలు కోరుకుంటారు.

జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి అనుభూతులు ఉండాలని.

కొన్ని జంటలు ప్రయత్నిస్తుంటాయి.అందుకోసం వివాహాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటున్నారు.

ఇప్పటివరకు మనం మహా అయితే.భూమి మీద, నీటిలో పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనలు చూసే ఉంటాం.

Advertisement
Will You Get Married Like This Bride, Groom, Viral Latest, News Viral, Social M

కానీ ఓ జంట మాత్రం ఏకంగా ఆకాశంలో పెళ్లి చేసుకున్నారు.అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా.? అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.గతేడాది కరోనా విజృభించడంతో లాక్ డౌన్ కారణంగా జరగాల్సిన ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.

మరికొందరైతే కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే వివాహాన్ని చేసుకున్నారు.కానీ అదే సమయంలో ఓ జంట మాత్రం ఏకంగా విమానంలో పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచేసింది.

వివరాల్లోకి వెళ్తే.తమిళనాడులోని మధురైకి చెందిన వధూవరులు రాకేష్, దక్షిణ పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

అందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేయించారు.మదురై అమ్మవారి సన్నిధిలో వీరి వివాహం జరగాల్సి ఉంది.

Will You Get Married Like This Bride, Groom, Viral Latest, News Viral, Social M
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

అయితే కరోనా కారణంగా తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది.లాక్‌డౌన్‌ రావడంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను రద్దు చేసుకున్నారు.కానీ తమ పెళ్లిని మాత్రం వాయిదా వేసుకోవాలనుకోలేదు.

Advertisement

ఇరు కుటుంబ సభ్యులు మొత్తం 161 మంది కలిసి రెండు గంటల కోసం ప్రత్యేకంగా ఓ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు.మొదట వీరంతా బెంగళూరు నుంచి మదురైకి బయలు దేరి వెళ్లారు.

విమానం టేకాఫ్‌ అయిన తరువాత గాల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి వధువుకి తాళి కట్టి జంట అవ్వగా.కుటుంబ సభ్యులు వీరిని ఆశీర్వదించారు.తిరిగి మళ్లీ మదురై నుంచి బెంగళూరుకు ప్రయాణమయ్యారు.

లాక్ డౌన్ లో జరిగిన ఈ పెళ్లి వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తాజా వార్తలు