టీ 20 వరల్డ్ కప్ లో వికెట్ కీపర్లు గా సెలెక్ట్ అయ్యేది వీళ్లేనా..?

ఇక ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా ప్రతి ప్లేయర్ కూడా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ వరల్డ్ కప్ లో ఛాన్స్ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే వికెట్ కీపర్ గా ఏ ప్లేయర్ని సెలెక్ట్ చేయాలి.

అనే దాని మీదనే ఇప్పుడు బిసిసిఐకి పెద్ద తలనొప్పిగా మారనుంది.ఎందుకు అంటే సంజు సాంసన్ , కే ఎల్ రాహుల్, రిషబ్ పంత్ ముగ్గురు కూడా మంచి పర్ఫామెన్స్ ను ఇస్తూ వాళ్ళ టీమ్ లను గెలిపించడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు.

ఇక ఇప్పటికే 9 మ్యాచ్ లను ఆడిన సంజు సాంసన్ 385 పరుగులు చేసి ఈ సంవత్సరం ఐపిఎల్ లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్లలో రెండోవ స్థానంలో కొనసాగుతున్నాడు.

Will They Be Selected As Wicket Keepers In The T20 World Cup, Samson, Pant, I

ఇక కేఎల్ రాహుల్( KL Rahul ) కూడా 9 మ్యాచుల్లో 378 పరుగులు చేసి తను కూడా నెంబర్ 3 పొజిషన్ లో కొనసాగుతున్నాడు.ఇక రిషబ్ పంత్ మాత్రం 10 మ్యాచ్ ల్లో 371 పరుగులు చేసి 4వ స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక వీళ్ళు ముగ్గురు కూడా తమదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన విజయాలను అందించడంలో మొదటి స్థానంలో ఉన్నారు.

Advertisement
Will They Be Selected As Wicket Keepers In The T20 World Cup, Samson, Pant, I

కాబట్టి వీళ్లలో ఎవరు టి20 వరల్డ్ కప్ ( T20 World Cup)కి సెలక్ట్ అవుతారు అనే విషయం మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది.ఇక ఈ ఐపిఎల్ మొత్తం ముగిస్తే గాని వీళ్ళు ఏ ప్లేయర్లు ఇంటింటి సెలెక్ట్ కాబోతున్నారని క్లారిటీ అయితే వచ్చే విధంగా కనిపించడం లేదు.

Will They Be Selected As Wicket Keepers In The T20 World Cup, Samson, Pant, I

మరి ఈ లోపే టీమ్ జట్టును కనక ప్రకటించినట్లైతే అందులో ఎవరి సెలెక్ట్ అవుతారు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇక ఇది ఇలా ఉంటే ఈసారి ఇండియన్ టీమ్ టీ 20 వరల్డ్ కప్ లో గెలవడమే లక్ష్యం గా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లు గా తెలుస్తుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు