విశ్వక్ సేన్( Vishwak Sen ) ఒక మంచి నటుడు అనే విషయం మనకు తెలిసిందే నిజానికి విశ్వక్ సేన్ ఏం చేసిన వార్తలలో నిలుస్తూ ఉంటాడు.ఈ మధ్య సూపర్ హిట్ అయినా బేబీ మూవీ స్క్రిప్ట్ ని మొదట డైరెక్టర్ సాయి రాజేష్ విశ్వక్ సేన్ కి చెప్పడానికి వెళ్తే నేను కథ వినను అని చెప్పి ఆయన్ని బయిటికి పంపించాడట…

ఇక దానితో తీవ్ర మనస్థాపానికి గురి అయినా సాయి రాజేష్ ఈ సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టాలి అని అనుకుని విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు అయినా ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) ని హీరో గా పెట్టి వెబ్ సిరీస్ ల ద్వారా ఫెమస్ అయినా వైష్ణవి ని హీరోయిన్ గా పెట్టి ఆయన తీసిన బేబీ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన మూవీ సక్సెస్ మీట్ లో డైరెక్టర్ సాయి రాజేష్( Sai Rajesh ) చేసిన కామెంట్లు చాలా వైరల్ గా మారాయి హీరో విశ్వక్ సేన్ ని ఉద్దేశించి చాలా రకాలైన మాటలు మాట్లాడాడు.ఇక దానికి అల్లు అర్జున్ కూడా ఆ హీరో అలా చేయడం కరెక్ట్ కాదు అని ఓపెన్ గా స్టేజ్ మీద చెప్పేసాడు.

ఇక ప్రస్తుతం అదే న్యూస్ నెట్లో తెగ వైరల్ అవుతుంది ఇక రీసెంట్ గా విశ్వక్ సేన్ ని ఉద్దేశించి బాహుబలి ప్రొడ్యూసర్స్ అయినా శోభు యార్లగడ్డ కూడా ఈ విషయం మీద ట్విటర్ లో ఒక ట్వీట్ చేసాడు.అయితే ఇది జరిగిన కొద్దీ సేపటికి మళ్లీ ఆయన డిలీట్ చేసినట్టు గా ఉన్నారు అందుకే ఆ పోస్ట్ కనిపించడం లేదు.నిజానికి ఈ మ్యాటర్ మీద ఆయన కూడా స్పందించడం తో ఈ వ్యవహారం అంత చూస్తుంటే విశ్వక్ సేన్ ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…








