చిరంజీవి సినిమాల్లో ఆ రైటర్స్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ గా ఉంటుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరోలు సైతం ఒకప్పుడు రుద్రవీణ, ఆపద్బాంధవుడు,స్వయం కృషి లాంటి సినిమాలు చేసి ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు.ముఖ్యంగా చిరంజీవి మాస్ హీరోగా ఉన్న సమయంలో ఇలాంటి ఎక్స్పరమెంట్లు చేసి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ఇలాంటి చిరంజీవి ఇప్పుడు మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్నాడు.

 Will The Writers Involvement Be More In Chiranjeevis Movies , Chiranjeevi , Ma-TeluguStop.com

ఎక్స్పరిమెంట్లు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకు అంటే ప్రస్తుతం ఆయనకి హిట్స్ మాత్రమే కావాలి.

Telugu Bhola Shankar, Chiranjeevi, Maruthi, Tollywood-Movie

దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగిన చిరంజీవి ఇప్పుడు కొత్తగా నటనపరంగా ప్రూవ్ చేసుకోవాల్సిందేమీ లేదు కాబట్టి ప్రస్తుతం స్టార్ డం కాపాడుకోవాలని చూస్తున్నారు.అందులో భాగంగా వస్తున్న సినిమాలే ఈ వాల్తేరు వీరయ్య భోళా శంకర్ ( Bhola Shankar )లాంటి సినిమాలు చేస్తూ చిరంజీవి ఇండస్ట్రీలో సర్వైవల్ అవుతున్నారు.

 Will The Writers Involvement Be More In Chiranjeevis Movies , Chiranjeevi , Ma-TeluguStop.com
Telugu Bhola Shankar, Chiranjeevi, Maruthi, Tollywood-Movie

ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు.అలాగే మారుతి( Maruthi ) డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది.అయితే ఈ సినిమా అనేది మారుతి ప్రభాస్ తో చేస్తున్న సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుందని కూడా తెలుస్తుంది… ఇక మొదటి నుంచి చిరంజీవి ప్రతి సినిమాకు సంబంధించిన స్టోరీని తనే దగ్గరుండి డైరెక్టర్లతో కూర్చొని మార్పులు,చేర్పులు చేయిస్తూ అవసరమైతే తన ఆస్థాన రచయితలు అయిన పరుచూరి బ్రదర్స్ ని కూడా కూర్చోబెట్టి ఆ స్క్రిప్ట్ ని మరింత బెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

ఇప్పుడనే కాదు చిరంజీవి ప్రతి సినిమా సమయంలో కూడా పరుచూరి బ్రదర్స్ ఇన్వాల్వ్ మెంట్ ఎంతో కొంత ఉంటుందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక డైరెక్టర్లు అయితే పరుచూరి వాళ్ల ఇన్వాల్వ్మెంట్ తో వాళ్ళు అనుకున్న కథకి వాళ్ళు చెప్పే సజెషన్స్ కి అసలు సంబంధం లేకపోవడంతో తలలు పట్టుకోవాల్సి వస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube