లోకేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందా?

ఇప్పటికే పీక్ స్టేజ్ కి చేరిన రాజకీయం లో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ మరింత హీట్ పుట్టించే నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుతో( N Chandrababu Naidu ) పాటు తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు కొంత మంది ఉన్నారని వ్యాఖ్యలు చేసిన ఏపీ సిఐడి చీఫ్ తన వ్యాఖ్యలకు తగ్గ ఆధారాలను కూడా చూపిస్తున్నారు.

తన రిమాండ్ రిపోర్టులో లోకేష్ ( Nara Lokesh )పేరును కూడా ప్రస్తావించిన సిఐడి ఆయనను విచారణకు పిలవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది .

ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించి ఆయనను అరెస్టు చేసే విధంగా పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి .దీనితో ఇప్పుడు తెలుగుదేశం క్యాంప్ కొంత కలవరానికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది.

ఇప్పటికే చంద్రబాబు( N Chandrababu Naidu ) అరెస్టుతో డీలా పడిన తెలుగుదేశం శ్రేణులు పొత్తు ప్రకటనతో కొంత బలం పుంజుకున్నాయి.అయితే ఆట ఇంకా చాలా మిగిలే ఉందని చంద్రబాబు అరెస్టు దీనికి ప్రారంభ సంకేతం మాత్రమేనని దీనితో సంబంధం ఉన్న అందరిని అరెస్టు చేసే దిశగా సిఐడి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది .దాంతో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని చారిత్రక సంఘటనలు జరగబోతున్నాయని ఎన్నికల సమయంలో వైసీపీ పూర్తిస్థాయి రిస్క్ తీసుకోవడానికే సిద్ధపడినట్లుగా వాతావరణం కనిపిస్తుంది.తాను అనుకున్నది చేయడమే తప్ప రియాక్షన్ చూసి వెనకడిగేసే రకం జగన్మోహన్ రెడ్డి కాదని ఈ విషయంలో ఫలితం ఎలాగున్నా తెగేదాకా లాగాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగానే తెలుస్తుంది.

మరి లోకేష్( Nara Lokesh ) కూడా అరెస్ట్ అయితే తెలుగుదేశాన్ని ముందుండి నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.

Advertisement

నారా కుటుంబ సభ్యులు నారా బ్రాహ్మణి, ( Nara Brahmani )భువనేశ్వరి ముందుకు వస్తారని ప్రచారం జరిగినా వారికి ఉన్న రాజకీయ అనుభవంతో వారు పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.అయితే దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తెలుగుదేశం లీగల్ టీం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇప్పటికే బెయిలు కోసం రెండు పిటిషన్లు తెలుగుదేశం లీగల్ టీం దాఖలు చేసింది.

దాంతో కచ్చితంగా తమకు రిలీఫ్ దొరుకుతుందని ఆశతో పార్టీ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి ముందు ముందు మరేన్ని కీలక మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి .

Advertisement

తాజా వార్తలు