తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.హుజూరాబాద్ లో విజయం సాధించాలని ఇటు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎవరి వారు పకడ్భందీ వ్యూహాలు అమలు చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే తమ కంచుకోట అయిన స్థానం అయిన హుజూరాబాద్ లో తమ పార్టీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్, ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి జోరు మీదున్న బీజేపీ హుజూరాబాద్ లో కూడా పాగా వేయాలని చాలా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ నుండి బయటికి రావడమే అన్న విషయం తెలిసిందే.
అయితే గత 20 ఏళ్ల నుండి హుజూరాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ లో పట్టు ఉంది.

అయితే ఈటెల టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ కు హుజూరాబాద్ లో ఈటెల లాంటి బలమైన నేత దొరకడం చాలా కష్టంగా మారింది.అందుకే ప్రజలను టీఆర్ఎస్ వైపు తిప్పుకునేలా రకరకాల వ్యూహాలను రచించారు కెసీఆర్.అందులో ఒక భాగమే దళిత బంధు పధకం.
అయితే దళిత బంధు పధకం ద్వారా ప్రతి ఒక్క దళితునికి పది లక్షలు రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఎక్కువ శాతం లబ్ధిదారులకు కూడా నగదు అందిన పరిస్థితి ఉంది.
ఇక దళిత బంధు పధకం ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారి ఇతర వర్గాల వారు కూడా తమకు కూడా దళితబంధు లాంటి పధకాన్ని ప్రకటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.ఏది ఏమైనా దళిత బంధు పధకం టీఆర్ఎస్ ను విజయ తీరాలకు చేరుస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.