ఇంతకీ తెలంగాణ లో టీడీపీ పోటీ చేస్తుందా లేదా ? మద్దతు ఎవరికి ? 

త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో హడావుడి తీవ్రం అయింది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, మెజార్టీ స్థానాలను దక్కిచుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉండగా, బిజెపి, బీఆర్ఎస్ లు సైతం పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ, కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను తాము దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి.

 Will Tdp Contest In Telangana Or Not? Who Is The Support, Telangana Tdp, Chandr-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తెలంగాణలో టిడిపి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అనేది ఎవరికి క్లారిటీ రావడం లేదు.పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.

అయినా పోటీపై మాత్రం అధినేత చంద్రబాబు నుంచి ఏ క్లారిటీ రాలేదు.ఇప్పటి వరకు పార్టీ నేతలతో ఆయన సమీక్ష కూడా నిర్వహించలేదు.

అంతేకాదు తెలంగాణ టిడిపి( Telangana tdp ) అధ్యక్షుడు నియామకం పైన చంద్రబాబు( Chandrababu ) దృష్టి పెట్టలేదు.దీంతో ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా లేదా, పోటీకి దూరంగా ఉంటే ఎవరికి మద్దతు ఇస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Telugu Chandrababu, Congress, Telangana, Telangana Tdp-Politics

ప్రస్తుతం ఈ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉండడంతో, పార్టీ నాయకుల్లోనూ గందరగోళం నెలకొంది.చాలాకాలంగా పార్టీ నాయకులు తెలంగాణలో పెద్దగా ఏ కార్యక్రమాలు చేపట్టడం లేదు.ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే మద్దతు ఎవరికి ఇవ్వాలనే విషయం పైన ఏ నిర్ణయం తీసుకోలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు.

ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించారు.అయితే ఇప్పుడు దానికంటే భిన్నమైన పరిస్థితులు తెలంగాణలో ఉండడంతో డైలమాలో పడింది.

ఏపీలో బిజెపి.టిడిపి.

జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే పార్టీకి అది డ్యామేజ్ జరుగుతుందని, బిజెపి పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భయమూ చంద్రబాబులో ఉంది.

అందుకే ఈ విషయంలో ఆయన సైలెంట్ గానే ఉన్నారు.

Telugu Chandrababu, Congress, Telangana, Telangana Tdp-Politics

ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది టిడిపికి రాజీనామా చేసి వివిధ పార్టీల్లో చేరిపోయారు అలాగే తెలంగాణ టిడిపి అధ్యక్షుడుగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తో పాటు, అనేకమంది నేతలు బీఆర్ఎస్ లో చేరారు .ఇక తెలంగాణ టిడిపిలో కీలకంగా ఉన్న చంద్రబాబు బంధువు నందమూరి సుహాసిని( Nandamuri Suhasini ) కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది.ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి టిడిపి మద్దతు ఇచ్చింది.

దీనిలో భాగంగానే కొద్ది రోజులు క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో సుహాసిని భేటీ రావడంతో ఆమె కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ ఎన్నికల్లో పోటీ, ఏదో ఒక పార్టీకి మద్దతు వంటి విషయాల్లో చంద్రబాబు వైఖరి ఏమిటి అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube