తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో హీరోయిన్ సౌందర్య( Soundarya ) మొదటి స్థానంలో అంటారు.ఆమె ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫ్యామిలీ సినిమాలను మాత్రమే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంది.
ఇక దురదృష్టవశాత్తు ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అనేది యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కోలుకోవాలని దెబ్బ అనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలోనే చాలా సంవత్సరాల తర్వాత సాయి పల్లవి( Sai Pallavi ) లాంటి హీరోయిన్ కూడా హోమ్లీ పాత్రలను చేస్తూ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటుంది.
ఇక ఇప్పుడు ఆమె రామాయణం సినిమాలో( Ramayanam Movie ) సీత పాత్రని పోషిస్తుంది.నిజానికి సాయి పల్లవి లాగా సెలెక్టెడ్ క్యారెక్టర్లు మాత్రమే చేసుకుంటూ ఉండటం అనేది చాలా కష్టమైన పని.ఎందుకంటే ఇక్కడ అవకాశాలు రావడమే కష్టం అలాంటిది వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేసి నాకు నచ్చిన సినిమాను మాత్రమే చేస్తాను అని మడికట్టుకు కూర్చోవడం అనేది మూర్ఖత్వం అని కొంతమంది అంటారు.కానీ సాయి పల్లవి మాత్రం అలా ఉండి తనకంటూ ఒక సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది.
అందువల్లే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్న రామాయణం సినిమాలో కూడా ఆమెని సీత పాత్రకి తీసుకోవడం వెనుక కూడా అదే కారణమని చెప్పాలి.
అయితే ఒకప్పుడు సౌందర్య ఎలాంటి పాత్రలు అయితే చేసిందో ఇప్పుడు తను కూడా అలాంటి పాత్రలు మాత్రమే చేస్తూ వస్తుంది.ఇక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు కొనసాగుతూనే నెంబర్ వన్ హీరోయిన్ గా కూడా ఎదిగింది.ఇక ఇప్పుడు సాయి పల్లవి కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా మారడం కోసమే చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.