రేవంత్ ఆ అస్త్రాన్ని వాడుతారా.. వదిలేస్తారా..?

రేవంత్ ఎంత ప్ర‌య‌త్నించినా స‌రే సీనియ‌ర్లు మాత్రం పెద్ద‌గా స‌హ‌క‌రించ‌ట్లేదు.ఆయ‌న ఎంత మొత్తుకున్నా ఎవ‌రూ ఏ కోసాన వినిపించుకోవ‌ట్లేదు.

దీంతో అంతిమంగా పార్టీకే తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంది.ఎంత సేపు త‌మ‌కు ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్న అక్క‌సు త‌ప్ప పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న పెద్ద‌గా లేదు.

రేవంత్ మీద ఉన్న కోపాన్ని పార్టీలో చూపించ‌డంతో చివ‌ర‌కు పార్టీ ప్ర‌తిష్ట దిగ‌జారిపోతోంది.ఇప్పుడు రేవంత్ ఇచ్చిన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం కూడా ఇలాగే ఉంటోంది.

ఎవ‌రూ దాన్ని సీరియ‌స్ గా తీసుకోలేదు.ఎట్టి ప‌రిస్థితుల్లో స‌భ్య‌త్వ న‌మోదును సీరియ‌స్ గా తీసుకుని టార్గెట్ పూర్తి చేయాలంటూ రేవంత్ రెడ్డి జిల్లాల అధ్య‌క్షుల‌కు ఆదేశాలు ఇచ్చారు.

Advertisement
Will Rewanth Use That Arrow .. Will He Leave Rewanth, Congress , Ts Poltics, K

అయితే జిల్లాల వారీగా చూసుకుంటే చాలా జిల్లాలు వెన‌క‌బ‌డిపోయాయి.ఏ మాత్రం కూడా స‌భ్య‌త్వ న‌మోదును పెద్ద‌గా నిర్వ‌హించ‌లేద‌ని తెలుస్తోంది.

ఇక‌పోతే ఈ విష‌యం మీద ఎలా పూనిచేశార‌ని రేవంత్ తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.అయితే ఈ మీటింగ్‌కు చాలామంది సీనియర్లు హ్యాండ్ ఇచ్చారు.

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జ‌గ్గారెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వారు రాలేదు.

Will Rewanth Use That Arrow .. Will He Leave Rewanth, Congress , Ts Poltics, K

వాస్త‌వానికి గైర్హాజ‌రైన నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్ద‌గా స‌భ్య‌త్వ న‌మోదు జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది.అందుకే రేవంత్ ముందు చిన్న బోవ‌డం ఎందుక‌ని రాలేద‌ని స‌మాచారం.పార్టీలో త‌మ‌కు ఉన్న ప్రాముఖ్య‌త దిగ‌జారుతుంద‌ని భావించి, రేవంత్‌కు స‌మాధానం చెప్ప‌డం ఇష్టంలేక వారంతా డుమ్మా కొట్టారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అయితే రాని వారంద‌రికీ రేవంత్ నోటీసులు ఇస్తారనే ప్ర‌చారం జ‌రుగుతోంది.అదే జ‌రిగితే వివాదం మ‌రింత ముదిరే ఛాన్స్ కూడా లేక పోలేదు.మ‌రి రేవంత్ వివాదానికి తెర లేపుతారా లేక సైలెంట్ అవుతారా అన్న‌ది వేచి చూడాలి.

Advertisement

 ఏదేమైనా కూడా ఇంకా సీనియ‌ర్లు దారికి రాక‌పోతే మాత్రం అంతిమంగా పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌ర‌గ‌డం ఖాయం అంటున్నారు నిపుణులు. .

తాజా వార్తలు