తనకు జరిగిన ప్రతి అవమానాన్ని గుర్తు పెట్టుకొని అంతకు అంతా బదులు తీర్చేసే నేతగా పేరు రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఉందని చెబుతారు.ముఖ్యంగా ఒకప్పుడు రాజకీయాల్లో తన స్తాయి గురించి జైపాల్ రెడ్డి( Jaipal Reddy ) చేసిన వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచి తన పట్టుదల ఎలాంటిదో నిరూపించారని చెబుతారు.
అలాంటిది ఒకప్పుడు తనకు కల్వకుర్తి లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన కేసిఆర్ కు తన స్థాయి ఏమిటో చూపించడానికి సుదీర్ఘ ప్రయాణంచేసిన రేవంత్( Revanth Reddy ) ఎట్టకేలకు తను అనుకున్న లక్ష్యాన్ని చేరగలిగారు.అయితే ఈ ప్రయాణంలో అనేక ఒడిదుకులు ఎదుర్కొన్న రేవంత్ ఒకానొక దశలో అయితే అష్టదిగ్బంధనం చేయబడ్డారు .ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో మీడియా సాక్షిగా పట్టు పడడంతో ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించారు .
ఆ సమయంలో ఒక్కగానొక్క కూతురు వివాహానికి కూడా హాజరవ్వడా నికి పోలీస్ పహారా తో వచ్చినప్పుడు ఆయన కలలో కనిపించిన కన్నీటి చెమ్మ చాలామందిని కదిలించింది .అయితే అవన్నీ గుర్తు పెట్టుకున్న రేవంత్ ఇప్పుడు తాను ముఖ్యమంత్రి అవ్వడంతో అంతకంత బదులు తీర్చుకుంటారా? బీఆరఎస్ హయం లో అడుగడుగునా అవినీతి జరిగినది అని ప్రతి ప్రాజెక్టు లోనూ కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని ఎన్నికల ప్రచార సమయంలో వ్యాఖ్యానించిన రేవంత్ ఇప్పుడు వాటిపై విచారణకు ఆదేశిస్తారా? కేసీఆర్ని( KCR ) జైలు పాలు చేసేందుకు తెగిస్తారా? అన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి .
అయితే రాజకీయ జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తిన్న రేవంత్ కు పూర్తిస్థాయిలో తత్వం బోదపడింది అని ముఖ్యమంత్రి పదవి లాంటి కీలకమైన స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యక్తిగత ద్వేషాలను పట్టించుకోరని కేవలం ఒక నిర్మాణాత్మక ప్రభుత్వంగా మాత్రం అసలు తప్పిదం ఎలా జరిగిందో తేల్చడానికి విచారణలు చేస్తారే తప్ప ,అందులో వ్యక్తిగత కక్ష ఉండదని కొంతమంది విశ్లేషిస్తున్నారు .అయితే తనను అడుగడుగున వ్యక్తిగతంగా కూడా అవమానిస్తూ అనేకఇబ్బందులు పెట్టిన బారస నేతలను అంత తేలిగ్గా రేవంత్ మర్చిపోరని రేవంత అభిమానుల లోని ఒక వర్గ విశ్లేషిస్తుంది.ఏది ఏమైనా అత్యంత కీలక దశకు చేరిన రేవంత్ ప్రయాణం మరి ఎలా ముందుకు ఎలా కొనసాగుతుందో అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.