రామబాణం ఓటిటి లో అయిన హిట్టు కొడుతుందా..?

శ్రీవాస్( Srivas ) డైరెక్షన్ లో గోపిచంద్ హీరోగా( Gopichand ) వచ్చిన మూవీ రామ బాణం( Rama banam movie )ఈ సినిమా బడ్జెట్ కు కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదు.50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 5 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సాధించలేదు.పీపుల్స్ మీడియా బ్యానర్ కు భారీ షాకిచ్చిన సినిమాల జాబితాలో ఈ సినిమా ముందువరసలో నిలిచిందనే సంగతి తెలిసిందే.ప్రముఖ ఓటీటీలలో( OTT ) ఒకటైన సోనీలివ్ ఓటీటీలో( Sony liv ) ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది…ఇక ఈ సినిమా తో గోపిచంద్ కెరియర్ మరింత డౌన్ అయిందనే చెప్పాలి.

 Will Ramabanam Be A Hit In Ott Details, Rama Banam,gopichand,rama Banam Movie La-TeluguStop.com

ఇక వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను ఈ ఓటీటీ కొనుగోలు చేస్తుండటం గమనార్హం.గోపీచంద్ కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.జడ్జిమెంట్ విషయంలో తప్పటడుగులు వేస్తే కెరీర్ ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది.2023 సంవత్సరంలో భారీ సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలవడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు సాధించినా ఇప్పుడు మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోతున్నారు.గోపీచంద్ రెమ్యునరేషన్ 7 కోట్ల రూపాయలుగా ఉంది.అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కొత్త తరహా కథలపై ఈ హీరో దృష్టి పెట్టాల్సి ఉంది.

 Will Ramabanam Be A Hit In OTT Details, Rama Banam,Gopichand,Rama Banam Movie La-TeluguStop.com

గోపిచంద్ మంచి నటుడు అయినప్పటికీ కథ విషయం లో గోపిచంద్ చాలా జాగ్రత్త గా చూసుకొని సినిమాలు చేసుకోవాలి…ఆ విషయం లో కరెక్ట్ గా ఉంటే ఈజీగా గోపిచంద్ ఒక సక్సెస్ ఫుల్ సినిమా తీయవచ్చు.అందుకే గోపి చంద్ మొహమాటానికి కాకుండా కథ ని బట్టి సినిమా తీసి మళ్ళీ హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూద్దాం.అలాగే ఇక రాబోయే సినిమాతో అయిన గోపిచంద్ మంచి సినిమా తీసి హిట్ కొట్టాలని కోరుకుందాం…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube