రాజమౌళి వల్ల అవుతుందా ఆ పని ?

బాలివుడ్ లో ఒక నానుడి ఉంది " రికార్డ్స్ అనేవి సృష్టించబడవు, బద్దలు కావు , అవి కేవలం ఒక ఆమీర్ ఖాన్ సినిమా నుంచి మరో ఆమీర్ ఖాన్ సినిమాకు వెల్లిపోతుంటాయి అని" .

అతిగా అనిపించినా, ముమ్మాటికి నిజమే.

గత అయిదు చిత్రాల్లో నాలుగు ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు ఆమీర్.అన్ని సార్లు తన రికార్డ్స్ ని తానె బద్దలు కొట్టుకున్నాడు.

అమీర్ గత ఏడాది విడుదల చేసిన పీకే భారి విజయాన్ని సొంతం చేసుకోని, లెక్కలేనన్ని రికార్డులు సృష్టించింది.ఆమీర్ ఖాన్ గత రికార్డులన్నిటిని భారి తేడాతో బద్దలు కొట్టింది.

ఇదే ఏడాది వచ్చిన, బజరంగి భాయిజాన్, రాజమౌళి బాహుబలి కుడా పీకే ను దాటలేకపోయాయి.ఇక 12 న విడుదలైన ప్రేమ్ రతన్ ధన పాయో పేకే దరిదాపుల్లోకి కుడా రాదనీ అంటున్నారు బాలివుడ్ ట్రేడ్ పండితులు.

Advertisement

హిందీలో యావరేజ్ టాక్ తో నడుస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేమ లీల గా వచ్చి భారి పరాజయాన్ని మూటగట్టుకుంది.పీకే సాధించిన 730 కోట్ల వరల్డ్ వైడ్ కలక్షన్లలో ఈ చిత్రం సగం కుడా సాధించడం కష్టమే అంటున్నారు.

డిసెంబర్ లో రానున్న షారుఖ్ దిల్వాలే కుడా పీకే దాటడం కష్టమే అని బాలివుడ్ ట్రేడ్ ఉవాచ.దానికి కారణం దిల్వాలే "బాజీరావు మస్తాని" వంటి పెద్ద చిత్రంతో పోటిపడటమే.

ఈ లెక్కన ఆమీర్ పీకే దాటాలంటే బాహుబలి రెండో భాగానికి మాత్రానికే సాధ్యం.రాజమౌళి వల్ల కుడా కాకపోతే, ఇక ఎప్పటిలాగే తన రికార్డ్స్ ను దాటడానికి అమీర్ ఖాన్ స్వయంగా రావాల్సిందే.

ఆమీర్ తదుపరి చిత్రం దంగల్ వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.

పుష్ప కేశవ పాత్రలో ఆ హీరో చేయాల్సి ఉంది.. వైరల్ అవుతున్న సుకుమార్ కామెంట్స్!

Advertisement

తాజా వార్తలు