టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ( Rajamouli )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రాజమౌళి ప్రస్తుతం వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకు ఆయన కెరియర్లో దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నాయి.ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇప్పటివరకు ప్లాప్ అవ్వలేదు.
అందుకే రాజమౌళితో సినిమాలు చేయడానికి హీరోలు సైతం పోటీ పడుతూ ఉంటారు.అయితే రాజమౌళి సినిమా విడుదల అవ్వాలి అంటే కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది.
సినిమా విడుదల తర్వాత ఆ హీరోల క్రేజ్ పెరగడం పక్క.
ఆ సంగతి పక్కన పెడితే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వడమనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది.ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలందరూ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని ఎదుర్కొన్నారు.అయితే ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య విషయంలో కూడా అదే జరిగింది.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చిరంజీవితో కలిసి చరణ్ నటించాడు.భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది.ఇక ఇప్పుడు అందరి ఫోకస్ జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర( Devara )’పై పడింది.ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న దేవర సినిమాకి కూడా కొరటాల శివనే డైరెక్టర్.
రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం ఈ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశముందని కొందరు అంటున్నారు.అయితే ఎన్టీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.2015 నుంచి తారక్ కి ఒక్క ప్లాప్ కూడా లేదు.ఆయన నటించిన గత ఆరు చిత్రాలు విజయవంతం అయ్యాయి.
అంతేకాదు ఆ ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలు ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేసినవే కావడం విశేషం.టెంపర్ సినిమా(Temper )కి ముందు పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు.
టెంపర్ సినిమాతో తాను సక్సెస్ ట్రాక్ లోకి రావడమే కాకుండా తారక్ కి మంచి విజయాన్ని ఇచ్చాడు పూరి.ఆ తర్వాత నాన్నకు ప్రేమతో జై లవకుశ, అరవింద సమేత సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించాయి.
ఈ సినిమాల దర్శకులు అందరూ కూడా ఫ్లాప్ దర్శకులే అని చెప్పాలి.దీంతో ఈ విషయంలో అభిమానులకు ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.
ఎన్టీఆర్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేకపోతే రాజమౌళి బ్యాట్స్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా ప్లాప్ అవుతుందా అన్న ప్రశ్నలు అభిమానులను కలవరపెడుతున్నాయి.మరి ఈ విషయంలో రాజమౌళి అలాగే ఎన్టీఆర్ ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలి అంటే సెప్టెంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.