ఏపీ రాజధాని విషయంలో గత కొన్నాళ్లుగా సందిగ్ధత కొనసాగుతూ వస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి( CM jagan ) అధికారంలోకి వచ్చిన తరువాత అసలు రాజధాని విషయంలో వైసీపీ ( YCP )సర్కార్ ఎలా వ్యవహరిస్తోందనే దానిపై ఎవరికి క్లారిటీ లేదు.
మొదట మూడు రాజధానులంటూ హడావిడి చేసిన జగన్మోహన్ రెడ్డి.ఇప్పుడేమే విశాఖే రాజధాని అంటూ పదే పదే చెబుతువస్తున్నారు.
ఈ దసరా కే విశాఖా నుంచి పాలన ప్రారంభం అవుతుందని, తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు గతంలోనే జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గి డిసెంబర్ లో రాజధాని మార్పు ఉంటుందని చెబుతున్నారు.దీంతో ఏంటి ఈ రాజధాని గోల అని సామాన్యులు శాతం తలపట్టుకునే పరిస్థితి ఏర్పడింది.అయితే జగన్ వైఖరి పట్ల ప్రత్యర్థి పార్టీ నేతలు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.
సిఎం హోదాలో జగన్ ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చని, అలా కాకుండా ఏకంగా తాను ఉన్న చోటునే రాజధానిగా ప్రకటించి పాలన సాగిస్తానంటే కుదరదని ప్రత్యర్థి నేతలు విమర్శిస్తున్నారు.బిజెపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు ( GVL Narasimha Rao )మాట్లాడుతూ ” విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని, ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని, రాజధాని విషయంలో కోర్టు తీర్పు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన చేసిన వ్యాఖ్యాల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు.

ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత ఎంతో మంది రైతులు భూములిచ్చారు.ఇప్పుడు అమరావతి కాకుండా ఇతర ప్రాంతాలను రాజధానిగా ప్రకటించేందుకు జగన్( CM jagan ) సిద్దమౌతుండడంతో అమరావతి రైతులు కోర్టును ఆశ్రయించారు.ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉంది.
అయినప్పటికి వైఎస్ జగన్ మాత్రం డిసెంబర్ నాటికి రాజధాని విశాఖకు షిఫ్ట్ అవుతుందని చెబుతున్నారు.మరి రాజధాని విషయంలో ప్రస్తుత పరిణామాలు జగన్ సర్కార్ కు ప్రతికూలంగాణే ఉన్నాయి.
మరి జగన్ అలాగే ముందుకు సాగుతారా లేదా రాజధాని విషయంలో వెనక్కి తగ్గి బ్యాక్ టూ అమరావతి అంటారా అనేది చూడాలి.