'గుంటూరు కారం' సమ్మర్ కి వెళ్లనుందా..? త్రివిక్రమ్ పని తీరుపై మహేష్ అసంతృప్తి!

బాక్స్ ఆఫీస్ వణికిపోయే రేంజ్ కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్.వీళ్లిద్దరి కలయిక లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు.‘అతడు’ మరియు ‘ఖలేజా’ చిత్రాలు బాగున్నప్పటికీ థియేటర్స్ లో ప్రేక్షకులు అప్పట్లో పెద్దగా ఆదరించలేదు.కానీ టీవీ టెలికాస్ట్ అప్పుడు మాత్రం ఈ రెండు సినిమాలు విజృంభించాయి.

 Will 'guntur Karam' Go To Summer Mahesh Unhappy With Trivikram's Performance ,-TeluguStop.com

ఇప్పటికీ కూడా ఈ సినిమాలు టీవీ లో వస్తే ప్రేక్షకులు పనులు మానుకొని మరీ చూస్తారు.ఆ రేంజ్ లో హిట్ అయ్యాయి కాబట్టే ఈ కాంబినేషన్ పై జనాల్లో అంత క్రేజ్ ఉంది.

ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి ‘గుంటూరు కారం( Guntur Kaaram )’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

జనవరి 12 వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన కూడా చేసారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Naa Saami Ranga, Sreeleela, Trivikram-Movie

అయితే ఈ చిత్రం ఇప్పుడు జనవరి 12 వ తేదీన విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కారణం రీ షూట్స్ అనే అంటున్నారు.మహేష్ బాబు కి ఏ సన్నివేశం కూడా ఒక పట్టాన నచ్చడం లేదట.

రషస్ చూసుకున్న తర్వాత త్రివిక్రమ్ పై అసంతృప్తి ని వ్యక్తం చెయ్యడం, మళ్ళీ అదే సన్నివేశం ని రీ షూట్ చేయించడం వంటివి చేస్తున్నాడు.దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది.

త్రివిక్రమ్ కి కూడా ఇలా చెయ్యడం తో మహేష్ బాబు( Mahesh Babu ) పై చాలా కోపం గా ఉన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.షూటింగ్ ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఈ సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

ఈ సినిమా జనవరి 12 వ తేదికి రాదు అనే ధైర్యం తోనే సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తున్నాయని అంటున్నారు.

Telugu Guntur Kaaram, Mahesh Babu, Naa Saami Ranga, Sreeleela, Trivikram-Movie

ఈ చిత్రంతో పాటుగా మాస్ మహారాజ రవితేజ ఈగల్, వెంకటేష్ సైన్డవ్, నాగార్జున ‘నా సామి రంగ( Naa Saami Ranga )’ సినిమాలతో పాటుగా, తమిళ డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధం గా ఉన్నాయి.‘గుంటూరు కారం’ షూటింగ్ ఎలా జరుగుతుందో ఇండస్ట్రీ లో ఉన్న అందరికీ తెలుసు కాబట్టే సంక్రాంతికి ఇంతమంది హీరోలు వస్తున్నారు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.

ఈ చిత్రం లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈరోజు జరుగుతున్న షూటింగ్ లో మీనాక్షి చౌదరి పాల్గొన్నది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube