IPL Delhi Capitals: IPL వేలంలో అడుగుపెట్టబోతున్న మరో స్టార్... ఢిల్లీ క్యాపిటల్స్ తాజా కధనం ఇదే!

ఈనెల అనగా, నవంబర్ 15న ప్లేయర్ రిటెన్షన్ గడువు ముగిసిపోతున్న సందర్భంగా శార్దూల్ ఠాకూర్, KS భరత్, న్యూజిలాండ్ ఆటగాడు అయినటువంటి టిమ్ సీఫెర్ట్‌లతో సహా 5 మంది ఆటగాళ్లను ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక వీరితో పాటు ఆంధ్ర ఓపెనర్ అశ్విన్ హెబ్బార్‌, మన్‌దీప్ సింగ్ లు కూడా విడుదలయ్యే అవకాశం లేకపోలేదు.ఇకపోతే శార్దూల్ ఠాకూర్‌ను రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

 Will Delhi Capitals Retain Shardul Thakur In Ipl Auction-TeluguStop.com

IPL 2022 ఎడిషన్‌లో 14 మ్యాచ్‌ల్లో శార్దూల్ 15 వికెట్లు పడగొట్టి హీరో అయ్యాడు.

ఈ క్రమంలో ఓవర్‌కు 10 పరుగుల పైనే ఇవ్వడం కొసమెరుపు.బ్యాట్‌తో అతను 10.81 సగటుతో, 137.93 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగులు చేశాడు.ఆ క్షణంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని ఇతర జట్లకు ట్రేడ్ చేయాలని అనుకుంది కానీ ఆ ఒప్పందం ఊహించినట్టే బెడిసికొట్టింది.కాగా అతని అధిక ధర ట్యాగ్ కారణంగా డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందు అతన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ విషయమై IPL అధికారి ఒకరు మాట్లాడుతూ…

Telugu Delhi Captaials, Ipl, Latest, Mandeep Singh, Rishap Panth, Shardul Thakur

శార్దూల్ ప్రీమియం ఆల్ రౌండర్ ఆటగాడు. అయితే అతని ధర మాత్రం కాస్త సమస్యగా ఉంది.” అని చెప్పడం కొసమెరుపు.న్యూజిలాండ్ బ్యాటర్ సీఫెర్ట్ తిరిగి వేలంలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు భోగట్టా.

ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ తరపున కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 24 పరుగులు చేశాడు మనోడు.ఇక కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయడం వలన అవకాశాలు కోల్పోయాడు.

పంజాబ్ వెటరన్ మన్‌దీప్ సింగ్ జట్టు తరపున ఆడిన మూడు గేమ్‌లలో 18 పరుగులు మాత్రమే చేసిన కారణంగా తీసుకోలేరు.అయితే U-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ యశ్ ధుల్‌ను ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకోనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube