గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే ఇక్కడ ప్రధాన పోటీ అంతా టిఆర్ఎస్ బిజెపి అన్నట్లుగానే ఉండేది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు హోరాహోరిగా తలపడతాయని, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు అందరికి ఉంటూ వచ్చాయి.
తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉన్నా.ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు వంటి వ్యవహారాలతో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తుంది.
దీనికి తోడు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంతా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తూ ఉండడం, అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తుండడం, సరిగ్గా ఇదే సమయంలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు , మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం దానిని గవర్నర్ ఆమోదించడం వంటివి జరిగాయి.ఇప్పుడు బిజెపి నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి , టిఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ ప్రధానంగా పోటీలో ఉన్నారు.ఇదిలా ఉంటే మునుగోడులో గతంతో పోలిస్తే కాంగ్రెస్ బలం పుంజుకుంది అనే సర్వే నివేదికలు ఇప్పుడు ఆ పార్టీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి .తాజాగా కొన్ని సర్వే నివేదికలు బయటకు వచ్చాయి.ఆ నివేదికలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, మొదటి స్థానంలో టిఆర్ఎస్ ఉందట.
కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య ఐదు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉందని, ఈ సర్వే రిపోర్టులు బయటకు వచ్చాయి.మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరినా.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు మాత్రం అలాగే ఉందట. అభ్యర్థి ఎవరైనా , బిజెపి కంటే కాంగ్రెస్ బెటర్ అన్న అభిప్రాయం ప్రజల్లో ఉండడంతో కాంగ్రెస్ ఇప్పుడు బిజెపి కంటే ముందు వరుసలో ఉన్నట్టుగానే కనిపిస్తోంది.
ఈ సర్వే నివేదికలు తెలంగాణ కాంగ్రెస్ లో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.కొద్దిగా కష్టపడితే పోలింగ్ సమయానికి కాంగ్రెస్ బాగా బలం పుంజుకుంటుంది అనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.ఇక రెండు రోజులుగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనేందుకు ప్రయత్నించిందనే అంశం కూడా కాంగ్రెస్ కు మరింత ఉత్సాహాన్ని కలిగించింది.
అలాగే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావం కచ్చితంగా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై ఉంటుందని, కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే సర్వే నివేదికలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మరింత ఉత్సాహం కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy