భవిష్యత్తులో కాంగ్రెస్‎లో వర్గ పోరు తొలుగుతుందా?

మరోసారి కాంగ్రెస్ వర్గపోరు భగ్గుమంది.ఇద్దరు సీనియర్ నేతలు పీసీసీ పర్యటనను వ్యతిరేకించడంతో వర్గపోరు తారా స్థాయికి చేరుకుంది.

 Will Class Struggle Disappear In Congress In Future, Ts Congress , Uttam Kumar R-TeluguStop.com

మరో నేత సన్నాహక సమావేశం జరగాల్సిందే అని పట్టుపట్టడంతో కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.కాంగ్రెస్ వర్గపోరు సహజమే కానీ రాహుల్ గాంధీ మీటింగ్ ఏర్పాటు చేసే సమయంలో నేతల మధ్యం ఆధిపత్య పోరు కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా అయోమయంలో పడింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చే క్రమంలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది.వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతున్నదని నమ్మే నేతలకు చుక్కెదురైంది.

నేతల మధ్య వర్గ పోరుతో సామాన్య కార్యకర్తలకు తలనొప్పిగా మారింది.ఎవరూ ఎటు వెళ్లాలనే ఆలోఛనలో పడ్డారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ అంతా బలంగానే ఉందని ఈ జిల్లాలో ఎవరి సమావేశాలు అక్కలేదని ఇక్కడి సీనియర్లు అంటున్నారు.అంతా తామే చూసుకుంటామని ఇద్దరు సీనియర్లు ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు అంటున్నారు.

మరో వర్గం మాత్రం పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించాల్సిందే అంటున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపడానికి కాంగ్రెస్ బలంగా తయారు కావాలంటే రేవంత్ రావాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఈ రెండు వర్గాల ఆదిపత్య పోరుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ రాజకీయం మరోసారి రచ్చకెక్కింది.మరో సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి తన తనయులు.

రేవంత్ రెడ్డికి సన్నిహితులు.ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడంపై మరో వర్గం తీవ్రంగా మండిపడుతోంది.

దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అధికార టీఆర్ఎస్ ను గద్దె దించడానికి కాంగ్రెస్ సీనియర్లంతా కంకణం కట్టుకుని అన్ని జిల్లాలో పర్యటించి కార్యకర్తల్లలో బలమైన నమ్మకాన్ని పెంచేపనిలో ఉన్నారు.

అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.వరంగల్ లో మే 6న జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభకు రాహుల్ గాంధీతో పాటు ముఖ్య నాయకులు పాల్గొని కార్యకర్తలకు ముఖ్య సూచనలు ఇవ్వనున్నారు.

ఈసభను విజయవంతం చేయడానికి పెద్దఎత్తున జనసమీకరణ చేయడానికి ఉత్తమ్ కొన్ని జిల్లాలో పర్యటనలు చేశారు.దీనిలో భాగంగానే నల్లగొండ జిల్లా పర్యటన అంశం రాగానే ఇక్కడి సీనియర్లంతా రేవంత్ రెడ్డి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించారు.

Telugu Jeevan Reddy, Rahul Ghandhi, Revanth Reddy, Senior, Trs, Ts Congress, Ts

కాంగ్రెస్ బలహీనంగా ఉన్న జిల్లాలలో మీ పర్యటనలు చేసుకోండి తప్ప మా జిల్లాకు రావొద్దని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూలు ప్రకారం రద్దు అయింది.నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం ఈ మీటింగ్ కు రేవంత్ రానునుండడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.భవిష్యత్తులో నేతల మధ్య వర్గ పోరు తొలుగుతుందా కాంగ్రెస్ పార్టీకీ పూర్వ వైభవం తీసుకువస్తారా వరంగల్ సభ విజయవంతం చేస్తారా? వీటన్నింటికి సమాధానం కావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube