సోషల్ మీడియా( Social Media ) వచ్చాక నేటి సమాజంలో పెను మార్పులు సంభవించాయి.ఒకప్పుడైతే అడవుల్లోకి వెళ్లి జంతువులను నేరుగా చూసేందుకు భయపడే జనాలు నేడు ఏకంగా అడవుల్లోకి వెళ్లి జంతువులను దగ్గరనుంచి చూడటం, అక్కడితో ఆగకుండా వాటితో సెల్ఫీలు, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలో ఎంతో మంది పర్యటకులు తమ సఫారీ వాహనాలతో అడవుల్లోకి వెళ్లి క్రూరమైన జంతువుల దగ్గర నుంచి సాదు జంతువుల వరకు అన్నింటినీ కూడా దగ్గర నుంచి చూస్తూ ఫోటోలు వీడియోలు తీయడం వంటివి చేస్తున్నారు.
దాంతో ఇలాంటి ఫోటోలు వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.అయితే పర్యటకుల లాగా అడవుల్లోకి వెళ్లి అవకాశం లేనివారు ఇక సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వీడియోలు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఇలా అడవుల్లోకి జంతువులను చూసేందుకు వెళ్తున్నా కొంతమంది పర్యటకులు మాత్రం కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఈ క్రమంలోనే వారు కొన్ని రకాల ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.
తాజాగా, ఈ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా అనేకమంది దానిపైన స్పందిస్తున్నారు.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా( Susanta Nanda ) ఇక తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియోని పంచుకున్నారు.ఈ నేపథ్యంలో సఫారీ వాహనంలో ఏనుగును ( Elephant ) చూసి ఎవరైనా భయపడితే.
వారు అడవిలోకి వెళ్లి ఎందుకంత బిగ్గరగా అరుస్తారు? జంగిల్ సఫారీలలో మనుషులుగా ప్రవర్తించండి.హుందాగా వినయంగా ఉండండి అంటూ దానికి క్యాప్షన్ రాసుకొచ్చారు.
వైరల్ అయిన వీడియోలో సఫారీ జీప్ పై ప్రయాణిస్తున్న పర్యటకుల బృందం వెళ్తుండగా.ఒక ఏనుగు వారికి ఛేజ్ చేసినట్టు చూడవచ్చు.