వైరల్: హాలీవుడ్ స్టంట్స్ చేస్తున్న అడవి పిల్లి..!

నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.ఒక్కోసారి ఆ వీడియోలను చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది.

ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా మారాయి.ఆ జంతువులను, పక్షులను చూస్తుంటే ఒక్కోసారి మనకే అసలు ఈ భూ ప్రపంచంలో అలాంటి జంతువులు కూడా ఉంటాయా అనే అనుమానం కలుగుతుంది కదా.అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఓ పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.పిల్లులను మనం ప్రతి రోజు చూస్తూనే ఉంటాము కదా.గోడ పైన నుంచి అటూ ఇటూ దూకుతూ ఉంటాయి.కానీ ఓ అడవి పిల్లి మాత్రం టేబుల్‌పై నుంచి అమాంతం ఫ్రిజ్‌పైకి దూకడం చూస్తే చాలా షాకింగ్ గా ఉంటుంది.

అది చేసిన ఆ జంప్‌ చూస్తే వారెవ్వా అని అనకుండా ఉండలేరు.అలాగే ఇంకొక వీడియోలో ఈ అడవి పిల్లి అచ్చం మనం చూసే పిల్లి లాగే గారాలు పోతూ బెడ్‌పై అటూ ఇటూ దొర్లుతుండటం మనం చూడవచ్చు.

ఈ అడవి పిల్లులు మన సాధరణ పిల్లుల మాదిరిగా అరవవు.వీటి అరుపు విచిత్రంగా ఉంటుంది.వీటి అరుపులు వింటే తప్పకుండా భయపడతారు.మ్యావ్ మ్యావ్ అని కాకుండా వింతగా అరుస్తుంది.

Wild Cat Doing Hollywood Stunts .. Hollywood Stuns, Latest News, Viral Latest,
Advertisement
Wild Cat Doing Hollywood Stunts ..! Hollywood Stuns, Latest News, Viral Latest,

ఇది సెర్వల్ జాతికి చెందిన పిల్లి అంట.ఈ జాతి పిల్లులు ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో మనకు కనిపిస్తాయి.మామూలు పిల్లిలాగా కాకుండా కొంచెం పొడవుగా ఉంటాయి వీటి చెవులు, కాళ్లు కూడా పొడవుగా ఉంటాయి.

అలాగే వీటి చర్మంపై చుక్కలు, చారలూ ఉంటాయి.ఇవి వన్య మృగాలు కావున వీటిని ఇళ్లలో పెంచుకోకుండా ఉంటేనే మంచిది.

ఇవి క్రూర మృగాలు అయితే కావు అంటే మనుషుల్ని చంపవు.గాని ఎవరన్నా తమకు హాని కలిగిస్తారు అని అనుకుంటే మాత్రం గోళ్లతో రక్కుతాయి.

ప్రస్తుతం ఈ అడవి పిల్లి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు