మెగా కాంపౌండ్ నుండి వినాయక్‌ తప్పుకున్నాడా? తప్పించారా?

మెగా స్టార్‌ చిరంజీవి వరుసగా సినిమాలు కమిట్ అయ్యాడు.ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.

ఒకటి రెండు వారాల్లో ఆచార్య షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఆచార్య షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం లూసీఫర్ రీమేక్ ను మోహన్‌ రాజా దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు.

ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఇక రికార్డు స్థాయిలో అంచనాలున్న వేదాళం రీమేక్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇదే సమయంలో జై లవకుశ చిత్ర దర్శకుడు బాబీ దర్శకత్వంలో కూడా చిరంజీవి ఒక సినిమాను చేయబోతున్నాడు.ఆ విషయాన్ని చిరు అధికారికంగా ప్రకటించాడు.

Advertisement

ప్రస్తుతం ఈ నలుగురు దర్శకులతో చిరంజీవి వర్క్‌ చేస్తున్నట్లుగా ఇటీవల ఒక పోస్ట్‌ పెట్టాడు.అందులో వినాయక్‌ లేకపోవడం చర్చనీయాంశంగా ఉంది.

కెరీర్ ఆరంభం నుండి కూడా వినాయక్ కు చిరంజీవి అంటే చాలా అభిమానం.ఆ అభిమానంతోనే వరుసగా సినిమాలు చేశాడు.చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెం.150 కూడా వినాయక్‌ దర్శకత్వంలో చేశాడు. లూసీఫర్‌ రీమేక్‌ ను వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి చేయాలనుకున్నాడు.

కాని కొన్ని కారణాల వల్ల సినిమా మోహన్ రాజా చేతిలోకి వెళ్లింది.అనూహ్యంగా ఆయనకు ఈ స్క్రిప్ట్‌ వెళ్లడం పట్ల పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

అసలు వివి వినాయక్‌ ఎందుకు చిరు క్యాంప్ నుండి బయటకు వచ్చేశాడు అనేది ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న.ఈ ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం కనిపించడం లేదు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

బాలీవుడ్‌ నుండి ఈయనకు చత్రపతి ఆఫర్‌ వచ్చింది.రీమేక్ అయినా బాలీవుడ్‌ ఆఫర్‌ కనుక చిరు మూవీని వదిలేసి ఉంటాడా అంటే ఔను అనే సమాధానం కూడా వినిపిస్తుంది.

Advertisement

మొత్తానికి మెగా కాంపౌండ్‌ నుండి చిరంజీవి రావడం పట్ల ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు