కోలీవుడ్ యాక్షన్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్( Vijayakanth ) గత నెలలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.71 సంవత్సరాల వయసులో విజయకాంత్ తుది శ్వాస విడిచాడు.అతడి మరణం ఎందరినో శోకసంద్రంలోకి నెట్టేసింది.శుక్రవారం నాడు కొద్దిమంది సమక్షంలో విజయ కాంత్ అంత్యక్రియలు జరిగాయి.మరణించడానికి ముందు విజయకాంత్ చాలా రోజులపాటు అనారోగ్యంతో సఫర్ అయ్యాడు.2023, డిసెంబర్ 26న ఆసుపత్రిలో చేరాడు.రెండు రోజులపాటు చికిత్స పొందాడు.అనంతరం చనిపోవడం జరిగింది.
విజయకాంత్ చనిపోయిన తర్వాత ఆయన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి.ముఖ్యంగా ఆయన పెద్ద కుమారుడి పెళ్లి నాలుగేళ్లుగా వాయిదా పడటానికి గల కారణాలేవో తెలిసొచ్చాయి.
విజయకాంత్ 1990 జనవరి 31న ప్రేమలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.వారిలో పెద్ద కొడుకు పేరు విజయ్ ప్రభాకరన్( Vijay Prabhakaran ), చిన్న కొడుకు పేరు షణ్ముఖ పాండ్యన్( Shanmukha Pandyan ) .2019లో ప్రభాకరన్‌కి కోయంబత్తూర్‌కి చెందిన ఒక ధనిక బిజినెస్ మ్యాన్ కూతురు అయిన కీర్తనతో( keerthana ) నిశ్చితార్థం జరిగింది.ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి కూడా విజయకాంత్ రాలేకపోయాడు.దానికి కారణం ఆ సమయంలోనే అతడు చాలా అనారోగ్యంతో సఫర్ అవుతున్నాడు.
నిశ్చితార్థం తర్వాత త్వరలోనే పెళ్లి వేడుక జరుగుతుందని అందరూ భావించారు కానీ ఏళ్ళు గడుస్తున్నా వారి పెళ్లి మాత్రం కార్యరూపం దాల్చలేదు, దీంతో నిశ్చితార్థంతోనే పెళ్లి ఆగిపోయిందని పుకార్లు మొదలయ్యాయి.కానీ ఈ పుకార్లలో నిజం లేదని విజయ కాంత్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.ఎంగేజ్మెంట్ ఫంక్షన్ తర్వాత కొన్ని నెలలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభించిందని, అందువల్ల పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని వారు వివరించారు.కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టినాక పెళ్లి చేయాలని ప్లాన్ చేశారట.
అయితే విజయ కాంత్ ప్రధాని మోదీ ( Prime Minister Modi )చేతుల మీదగా తన పెద్ద కుమారుడి పెళ్లి చేయాలని కలలు కన్నాడట.
అందుకే ఇన్ని రోజులు ఆగినం కదా మరికొద్దిరోజులు వెయిట్ చేసి ప్రధాని సమక్షంలో పెళ్లి వేడుక జరిపిద్దాం అని వధూవరులకు నచ్చ జెప్పాడట.కానీ పెళ్లి ముహూర్తానికి మోదీ చాలా బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు.దాంతో పెళ్లి మరొకసారి వాయిదా పడింది.
తర్వాత మోదీ పెళ్లికి వస్తానని హామీ ఇచ్చారు కానీ విజయ కాంత్ ఆరోగ్యం బాగా క్షీణించింది.దీనివల్ల ఆసుపత్రికి తిరగడమే సరిపోయింది.
మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ అమెరికాకి కూడా తీసుకెళ్లారు.ఈ పరిస్థితులలో పెళ్లి చేసుకోవడం కుదరక ఇప్పటిదాకా దానిని వాయిదా వేస్తూ వచ్చారు.