వెంకటేష్ 18 ఏళ్లకే నిర్మాతగా మారడం వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

ఒక పని చేయాలంటే.చేతిలో డబ్బులు ఉండాలి.

చేయాలనే తపన ఉండాలి.

అప్పుడే ఏమైనా చేయగలం.

వయసుతో సంబంధం లేకుండానే అనుకున్నది సాధించవచ్చు.సేమ్ ఇలాగే చేశాడు హీరో వెంకటేష్.

తన అభిమాన నటుడితో సినిమా చేయాలనే పట్టుదలతో ఏకంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడ్యూసర్ గా మారిపోయాడు.అప్పటికి ఆయన వయసు కేవలం 18 ఏండ్లు మాత్రమే.

Advertisement
Why Venkatesh Started Career As Producer In His 18 Years Time, Venkatesh Intervi

తన తండ్రి రామానాయుడు ఏర్పాటు చేసిన సురేష్‌ ప్రొడక్షన్స్ ఉన్నా.పంతం పట్టి ఈ పని చేశాడు.

ఈ సంస్థలో కేవలం ఒకే ఒక్క సినిమాను నిర్మించాడు.మళ్లీ వెంకటేష్ నిర్మాతగా తన బ్యానర్లో ఏసినిమా చేయలేదు.

ఇంతకీ తను ఎందుకు ఈ సంస్థను స్థాపించాడు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.వెంకటేష్ కు శోభన్ బాబు అంటే ఎంతో ఇష్టం.

తన అభిమాన నటుడితో సినిమా చేయాలనేది తన కోరిక.ఆ కోరిక ను 18 ఏళ్ల వయసులోనే తీర్చుకున్నాడు వెంకటేష్.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

తన ఇష్ట నటుడు శోభన్ బాబును ఎన్నో సార్లు కలిశాడు వెంకటేష్.ఒక సారి శోభన్ బాబుతో సినిమా ను తీస్తానంటూ తండ్రి రామానాయుడు దగ్గర చెప్పాడట.

Advertisement

శోభన్ బాబు మనం ఎప్పుడు అడిగే అప్పుడు మన బ్యానర్ లో నటించేందుకు సిద్దంగా ఉంటాడని చెప్పాడట తానే సొంతంగా బ్యానర్‌ ను ఏర్పాటు చేస్తానంటూ రామానాయుడుతో అన్నాడట.

Why Venkatesh Started Career As Producer In His 18 Years Time, Venkatesh Intervi

తండ్రి సరే అని చెప్పడంతో వెంకటేష్ ఎంటర్‌ ప్రైజెస్‌ బ్యానర్‌ స్థాపించి.సినిమాను మొదలుపెట్టారు.ఎంకి-నాయుడు బావ అనే టైటిల్ తో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా వెంకటేష్‌ సినిమాను నిర్మించాడు.

బోయిన సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించాడు.డబ్బు పెట్టింది అంతా రామానాయుడు అయినా నిర్మాత డి వెంకటేష్ అంటూ పేరు వేశారు.18 ఏళ్ల వయసులోనే నిర్మాతగా పేరు వేయించుకున్న ఘనత వెంకటేష్ కు దక్కింది.అనంతరం సినిమాల్లోకి వచ్చిన వెంకటేష్ పలు హిట్ సినిమాలు చేసి.

టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు.

తాజా వార్తలు