ఈ మధ్యకాలంలో దర్శక నిర్మాతలు అందరూ కూడా సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ రావాలని పట్టుబడుతున్నారట.అదేంటి సినిమాకి A సర్టిఫికెట్ అంటే పెద్దలకు మాత్రమే అనే కదా ? పిల్ల జెల్ల అందరూ చూడగలిగేది కాదు కదా అని అనుమానం వస్తుందా ? కానీ అసలు మతలబు వేరే ఉంది.ఈ మధ్య కాలంలో A సర్టిఫికెట్ వచ్చిన సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.ఎందుకంటే ఏ చిత్రానికైనా A+ సర్టిఫికెట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రమని అర్థం.
కానీ ఆ వస్తే అందులో ఖచ్చితంగా మితిమీరిన హింస, అడల్ట్ కంటెంట్, అభ్యంతరకరమైన సీన్స్ లేదా డైలాగ్స్ ఖచ్చితంగా ఉంటాయి.వాటి కోసమే సినిమాలు చూడడానికి కొంతమంది వెళ్తున్నారట.

అందువల్లే తమ సినిమాకి ఖచ్చితంగా A సర్టిఫికెట్ కావాలని దర్శక నిర్మాతలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది.ఈ మధ్యకాలంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఆనిమల్ సినిమా( Ranbir Kapoor ) మితిమీరిన హింస కారణంగా A సర్టిఫికెట్ వచ్చింది.దాంతో ఆ సినిమా సూపర్ డూపర్ అయిపోయింది.
సలార్( Salaar ) కూడా ఈ క్యాటగిరి సినిమానే.దీనికి కూడా A సర్టిఫికెట్ వచ్చింది.
సరే ఈ రెండు సినిమాలు మితిమీరిన హింస కారణంగా ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నాయి అనుకుంటే బేబీ సినిమా కూడా బోల్డ్ సన్నివేశాల కారణంగా ఏ సర్టిఫికెట్ తెచ్చుకొని విజయాన్ని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అంతేకాదు తాజాగా బీమా, గామి చిత్రాలు కూడా A సర్టిఫికెట్ పొందాయి.
బీమా సినిమాలో కాస్త హింస ఉంది కాబట్టి A సర్టిఫికెట్ వచ్చింది.

కానీ గామి చిత్రం( Gaami )లో అలాంటిదేమీ లేదు.అయినా కూడా A సర్టిఫికెట్ వచ్చింది.దానికి కారణమేంటి అని జుట్టు పీక్కున్నా కూడా అర్థం కాని పరిస్థితి.ఇక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మ్యాడ్ చిత్రం కూడా A సర్టిఫికెట్ సాధించి కాసులు కురిపించుకుంది.
ఇలా A సర్టిఫికెట్ వస్తే ఓపెనింగ్స్ అదిరిపోతాయి అని అందరూ నమ్ముతున్నారు.కానీ ఈ కల్చర్ ఇలాగే ముందుకు వెళితే బోల్డ్ కంటెంట్ ఉంటుందని చాలా మంది సినిమాకి వెళ్లే అవకాశం ఉంది అది రాను రాను నష్టాన్ని చేకూర్చుతుందని కొంతమంది భావిస్తున్నారు.