టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ సూపర్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) మరియు సమంత ( Samantha )హీరో హీరోయిన్స్ గా నటించిన ఖుషి సినిమా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.దాదాపు మన కొండన్నకి ఐదేళ్లకు పైగా హిట్టు లేదు తను నటించిన ఆ చివరి మూడు సినిమాలు దారుణ పరాజయాన్ని మూట కట్టుకున్నాయి.
ఇప్పటికే అతనిపై మిగతా హీరోలకు పీకల వరకు ఉంటుంది మరి ఈ సినిమా కూడా పోతే అందరూ పండగ చేసుకునేవారు.అలాగే సమంత సైతం శాకుంతలం పరాజయంతో మంచి విజయం కోసం ఎదురుచూస్తోంది.
వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా మొదటి షో నుంచే ఏ పాజిటివ్ సొంతం చేసుకుంది.

శివ నిర్వాణ( Shiva Nirvana ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు మైత్రి మూవీస్ కూడా.ఇక అనుకున్నట్టే సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పుంజుకుంటుంది కానీ ఎటోచి ఈ సినిమా బాగుంది అని ట్రీట్ చేసే మిగతా హీరోలు ఏమైపోయారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చిన్న సినిమా విజయం సాధించిన బాగుంది అంటూ ఈరోజు వరస ట్వీట్స్ చేస్తారు మరి విజయ్ దేవరకొండ సినిమా మరియు సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎవరు స్పందించకపోవడం విశేషం.
దీన్ని బట్టి చూస్తే మిగతా హీరోలకు ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ అంటే ఉన్న కోపాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

విజయ్ దేవరకొండ తన సినిమాలు ప్రమోట్ చేసుకునే విధానం డిఫరెంట్ గా ఉంటుంది మిగతా హీరోలతో పోలిస్తే విజయ్ తో ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.మనం కొంత చేయమంటే ఎంతో చేస్తాడు.సినిమా కోసం ఏ రకమైన ప్రమోషన్ చేయడానికి అయినా వెనుకాడడు.
అందుకే విజయ్తో పోలిస్తే చాలా హీరోల తో మిగతా దర్శకులకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.మొత్తానికి విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత హిట్ అయితే పడింది కానీ మిగతా హీరోలకు ఉన్న కుళ్ళు కూడా బయటపడింది.







