లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్న స్టార్ హీరోయిన్లు.. ఎందుకో తెలుసా?

సినిమా పరిశ్రమలో హీరోలతో పోల్చితే హీరోయిన్లకు ఇచ్చే ఇంపార్టెన్సీ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.నార్త్, సౌత్ అనే తేడా లేదు.

టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేదు.ఎక్కడ చూసినా హీరోలదే ఆధిపత్యం.

హీరోయిన్లు అంటే గ్లామర్ డాల్స్ గానే చూస్తుంటారు ఫిల్మ్ మేకర్స్.అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం అంగాంగ ప్రదర్శన కాకుండా.

నటనా ప్రాధాన్యత ఉండే క్యారెక్టర్లు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు.రెమ్యునరేషన్ విషయంలోనూ కాస్త అధికంగానే ఉండేలా చూసుకుంటున్నారు.

Advertisement

అలా ఉండాలంటే లేడీ ఒరియెంటెడ్ సినిమాలు ఒక్కటే మేలని భావిస్తున్నారు.వాటివైపే మొగ్గు చూపుతున్నారు పలువురు స్టార్ హీరోయిన్లు.

టాలీవుడ్ తో పోల్చితే బాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి.కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు ఈ సినిమాలు చేస్తున్నారు.

రెమ్యునరేషన్ సైతం కోట్లల్లో తీసుకుంటున్నారు.అంతేకాదు.

పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన పరిస్థితి ఉంది.గత కొంత కాలంగా సౌత్ లోనూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెరుగుతున్నాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
వ‌ర్షాకాలంలో ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే జ‌లుబు, దగ్గుకు దూరంగా ఉండొచ్చు!

వాటిని జనాలా బాగా ఆదరిస్తున్నారు కూడా.దీంతో పలువురు హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది నయనతార.ఆమె ఒక్కోసినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటుంది.

అటు మహానటి లాంటి అద్భుత సినిమాలో నటించింది కీర్తి సురేష్.ఆ తర్వాత వరుసగా మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది.భారీగా రెమ్యునరేషన్ సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.వీరు చేసి సినిమాలు సైతం భారీగా వసూళ్లు చేపడుతున్నాయి.

అటు సమంత సైతం తాజాగా గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తుంది.ఈ సినిమాకు గాను తను మూడు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుసస్తోంది.

అటు ఈ సినిమాకు కేవలం 5 నెలల డేట్లు మాత్రమే ఇచ్చిందట సమంత.ఈ సినిమా మంచి విజయం సాధిస్తే.

ఆమె రెమ్యునరేషన్ మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు