ఏపీలో టీడీపీ( TDP party ), జనసేన, బీజేపీ పార్టీల మద్య పొత్తు వ్యవహారం ఎప్పుడు కూడా చర్చనీయాంశంగానే ఉంటుంది.వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ జనసేన పార్టీలు పొత్తు కు సై అని గతంలోనే హింట్ ఇచ్చాయి.
కానీ అధికారికంగా మాత్రం పొత్తుపై ఏకాభిప్రాయానికి రావడం లేదు.దీనికి ప్రధాన కారణం బీజేపీనే.
ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ జనసేనతో పొత్తులో ఉంది.అందువల్ల టీడీపీతో కలవడానికి బీజేపీ మొగ్గు చూపడం లేదనేది అందరికీ తెలిసిన విషయం.
కానీ ఏపీలో వైసీపీ( YCP party )ని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిస్తేనే సాధ్యమౌతుందనేది పవన్ అభిప్రాయం.

దాంతో టీడీపీ మరియు బీజేపీ పార్టీ( BJP party )లను కలిపేందుకు జనసేనాని ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించడం లేదట.తాజా పరిస్థితులు చూస్తుంటే టీడీపీ ఒంటరిగానే వెళ్లడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.ఎందుకంటే పొత్తుతో సంబంధం లేకుండా అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు సిద్దమౌతున్నారు.
ఈ నేపథ్యంలో పొత్తుపై తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.పొత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ మాత్రమే కలిసి వెళ్తాయా లేదా టీడీపీ కూడా కలుస్తుంటా అనేది ఇప్పుడే చెమ్మలేమని పవన్ తేల్చి చెప్పారు.
దీంతో పొత్తు ఉంటుందా ఉండదా అనే కన్ఫ్యూజన్ మరింత పెరుగుతోంది.కాగా అసలు పొత్తు విషయంలో ఎందుకీ కన్ఫ్యూజన్ అనే దానిపై విశ్లేషకులు పలు రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు( N Chandrababu Naidu ) ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించిన నేపథ్యంలో సిఎం అభ్యర్హ్తిగా తానే ఉండాలనేది ఆయన కోరిక.అందుకు బీజేపీ మరియు బీజేపీలు సుముఖంగా లేవట.ఇదే పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడానికి అసలు కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు.ఎందుకంటే ఈసారి సిఎం పదవిపై పవన్ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టారు.అటు బీజేపీ కూడా ఆ పార్టీకి చెందిన వారైనా లేదా పవన్ అయిన సిఎం అభ్యర్థిగా ఉండాలని ఆశిస్తోంది అందుకో పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి రావడం లేదనే విశ్లేషకులు చెబుతున్నా మాట.కాగా ఎన్నికలకు ఇంకా టైమ్ ఉండడంతో ముందు రోజుల్లో పొత్తు వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







