సుమ మాత్రమే ప్రతి సారి ట్రోలింగ్ కి ఎందుకు గురవుతుంది ?

ఇప్పటికీ చాలాసార్లు సుమ పై సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయి.ఒకసారి భర్తతో గొడవ పడుతుందని, విడాకుల వరకు వెళ్లిందని, ఇక ఏదైనా ఆడియో ఫంక్షన్స్ జరిగితే సుమతి భగ్గుమన్న స్టార్ హీరో అంటూ సరికొత్త కథనాలు అల్లడం వంటి కామెంట్స్ సర్వ సాధారణంగా మారిపోయాయి.

 Why Suma Always Target On Social Media,social Media,anchor Suma,junior Ntr,amigo-TeluguStop.com

ఎక్కడ ఏం జరిగినా సుమది మాత్రమే తప్పు అన్న విధంగా ఏదో ఒక థంబ్నెయిల్ పెట్టి యూట్యూబ్లో వీడియోలు రావడం కూడా బాగా అలవాటైపోయింది.మరి ఈ మధ్య సోషల్ మీడియా విస్తృతంగా పడగవిప్పిస్తున్న సమయంలో సెలబ్రిటీలు ఏ చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా దారుణంగా పరిస్థితి తయారయింది.

Telugu Amigos, Anchor Suma, Ntr, Kalyan Ram, Trolls-Movie

అమిగోస్ ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ సుమపై ఫైర్ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి.అసలు వాస్తవం ఏంటో కూడా తెలియకపోయినా ఆ ఎవరికి నచ్చిన విధంగా వారు కథనాలు అల్లుతూనే ఉన్నారు.నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆరోగ్యం సరిగా లేక షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.పైగా తారక రత్న కూడా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య కళ్యాణ్ రామ్ కోసం అమిగోస్ గెస్ట్ గా వచ్చాడు.ఫంక్షన్ మొదలైన క్షణం నుంచి జూనియర్ నిలబడలేని స్థితిలో ఉన్నాడు.

త్వరగా ముగించుకొని వెళ్లాలన్న ఆత్రుత కూడా ఆయనలో కనిపించింది.దాంతో తన తదుపరి సినిమా అప్డేట్ తారక్ ఇస్తాడు అన్నట్టుగా సుమ మాట్లాడి తారక్ కి మైక్ చేతికిచ్చింది.

Telugu Amigos, Anchor Suma, Ntr, Kalyan Ram, Trolls-Movie

అసలు ఇందులో సుమ చేసిన తప్పు ఏముంది ఎందుకు ఆమెపై సోషల్ మీడియా కాలు దువ్వుతోంది.కేవలం సుమ మాత్రమే కాదు సెలబ్రిటీలు ఎవరైనా సరే అకారంగా సోషల్ మీడియా చేతిలో బలైపోతున్నారు.సామాజిక మాధ్యమాలను సరిగ్గా వాడుకోకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.మాత్రమే ఇలా ట్రోలింగ్ కి గురి కావడం వెనక కారణాల విషయానికొస్తే ఆమె చాలా ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూనే ఉంది.

కొత్తవారు రాకపోవడం పైగా పంచుల వర్షం కురిపించడంలో ఆమెను ఎవరు దాటలేకపోవడం వంటి కారణాలతో ఆమె ఎన్నో ఏళ్లుగా పోస్టింగ్ చేస్తుండటంతో మీడియాకి ఆమెపై బురద జల్లడం బాగా అలవాటయింది.ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలం సుమకు మాత్రమే కాదు సెలబ్రిటీలందరికీ కూడా గడ్డు కాలమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube