ప్రేక్షకులు మెచ్చిన ఆ స్టార్ హీరోయిన్ ను.. ఎన్టీఆర్ మాత్రం తన సినిమాలో వద్దన్నాడట తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటసార్వభౌముడుగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు.తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి.

తెలుగు చిత్రపరిశ్రమలో ఆయనను కొట్టే హీరో ఎవరూ లేరేమో అనేంతగా హవా నడిపించాడు.సినిమాలే ఊపిరిగా బ్రతికిన నందమూరి తారక రామారావు తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని ఎల్లలు దాటించారు అని చెప్పాలి.

అయితే అన్న గారి సినిమాలో ఎవరు హీరోయిన్గా బాగుంటారు అనే విషయాన్ని అటు అన్న గారు స్వయంగా శ్రద్ధ తీసుకుని మరి నిర్ణయించేవారు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంతో పాపులారిటీ ఉన్న హీరోయిన్లను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన కోట్ల మంది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వహీదా రెహ్మాన్ ను కూడా ఓసారి అన్నగారు రిజెక్ట్ చేశారట.ఇక తెలుగులో ఏరువాక సాగారో అనే పాట లో తళుక్కున మెరిసి తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టింది వహిదా రెహమాన్.

Advertisement

ఇలాంటి హీరోయిన్ ను అందరూ తమ సినిమాల్లో పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు.

కానీ అన్న గారు మాత్రం వహీదా రెహమాన్ నూ తన సినిమాలో వద్దు అన్నారు.ఇది అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసింది.లవకుశ సినిమా సమయంలో ఎన్టీఆర్ను రాముడిగా తీసుకోగా సీత కోసం ఎవరైతే బాగుంటుంది అనే ఆలోచనలో పడ్డారు దర్శకనిర్మాతలు.

అలాంటి సమయంలోనే అంజలీదేవి సావిత్రి లాంటివారు బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేమని చెప్పేశారు.వహీదా రెహమాన్ ను తీసుకోవాలని అనుకున్నారు.కానీ ఎన్టీఆర్ ఒప్పుకోలేదట.

మన తెలుగు అమ్మాయి ఉండాలని పట్టుబట్టారు.ఈ క్రమంలోనే అన్నగారే హీరోయిన్ ఎంపిక చేసే బాధ్యతను తీసుకుని చివరికి అంజలీదేవి తో చర్చలు జరిపి షెడ్యూల్లో అడ్జస్ట్మెంట్ చేసి ఒప్పించారట.

వైరల్ వీడియో : ఇలాంటి వికృతానందం సరి కాదంటూ హెచ్చరిక చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

ఇక ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Advertisement

తాజా వార్తలు