Rajashekar : రాజశేఖర్ కెరీర్ పతనం అవ్వడానికి కారణం ఎవరు ? ఆ ఒక్కటే కొంప ముంచిందా ?

హీరో రాజశేఖర్( Rajasekhar ) ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెళుతూతు ఉండేవాడు.పోలీస్ ఆఫీసర్ గా ఆయన చేసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానే కట్టిపడేసేవి.

 Why Rajasekhar Is Facing Down Fall-TeluguStop.com

పైగా ఆయన భార్య జీవిత తో తీసిన అన్ని చిత్రాలు మంచి విజయం సాధించడం తో హీరోగా ఆయన కెరీర్ కి డోకా లేకుండా పోయింది.అయితే ప్రస్తుతం హీరో రాజశేఖర్ కెరీర్ ఫామ్ లో లేదు.

పైగా అతడు ఏ సినిమా రిలీజ్ చేసే పరిస్థితిలో కూడా లేడు.రాజశేఖర్ భార్య జీవిత( Jeevitha ) అన్ని రకాలుగా ఆయనకు సపోర్ట్ ఇస్తూ సినిమాలు లైనప్ చేసిన ప్రస్తుతం దాదాపు కెరీర్ చివరికి చేరుకున్నాడు రాజశేఖర్.

Telugu Rajasekhar, Jeevitha, Shekar, Tollywood-Movie

మరి ఆయన కన్నా కూడా వయసులో పెద్ద హీరోలు ఇంకా ఇండస్ట్రీ లో హీరోలుగా చెలామణి అవుతుంటే రాజశేఖర్ మాత్రం ఎందుకు డౌన్ ఫాల్ చూడాల్సి వస్తుంది ? పైగా ఆర్థికంగా కూడా రాజశేఖర్ అప్పుల పాలయ్యి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నిజానికి రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పేరు ఉంది.ఆయన పేరుకు తగ్గట్టే చాల ఆవేశ పరుడు.ఎవరైనా ఆయన మాటకు ఎదురు చెప్తే తట్టుకోలేడు.కోపం లో ఏం మాట్లాడుతాడో అతడికే తెలియదు.ఒకసారి బాంబే నుంచి వచ్చిన హీరోయిన్ విషయంలో కోపం తో ఊగిపోయి ఏకంగా ఆమెకు గన్ను గురి పెట్టాడు అనే వార్త ఎప్పటి నుంచో ఉంది.

Telugu Rajasekhar, Jeevitha, Shekar, Tollywood-Movie

పైగా ఏ సినిమా షూటింగ్ అయినా కూడా టైం కి వచ్చే అలవాటు లేడు.లేటుగా అర్ధరాత్రి వరకు మందు తాగుతూ మధ్యాహ్నం సినిమా షూటింగ్ కి తీరిగ్గా వస్తాడు.అలంటి హీరో తో నటించడానికి కానీ, సినిమా తీయడానికి కానీ దర్శకులు ముందుకు రావడం లేదు.దాంతో రాజశేఖర్ కెరీర్ అంచెలంచెలుగా పడిపోతూ వచ్చింది.ఒక్క మాటలో చెప్పాలంటే ఇక పై ఆయన సినిమాలు తీస్తారో లేదో కూడా అనుమానమే.కూతుళ్లను( Shivathmika Rajashekar ) అయినా సరిగ్గా లాంచ్ చేద్దాం అని ఎంత ప్రయ్నతించిన అది కూడా సరిగ్గా వర్క్ అవుట్ అవ్వలేదు.

ఇక నిర్మాతలతో ఆర్థిక పరమైన గొడవలు, దర్శకులతో పేచీలు వెరసి రాజశేఖర్ అనే హీరో కనుమరుగు అయిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube