Puri jagannadh : పూరి ఇష్టపడి కట్టుకున్న ఇంటికి RGV కేవ్ అని పేరు ఎందుకు పెట్టాడు ?

ఇటీవల అజయ్ గోష్ ( Ajay Ghosh )అనే ఒక నటుడు ఇంటర్వ్యూ ఇస్తూ చనిపోవడానికి సిద్ధమైన ఏ వ్యక్తి అయినా ఒక ఐదు నిమిషాల పాటు పూరి జగన్నాథ్ ( Puri Jagannath )తో మాట్లాడి బయటకు వస్తే కొత్త ఉత్తేజం తో జీవితంలో ముందుకు వెళతాడు అని చెప్పాడు.

ఈ మాట అక్షసత్యం.

ఎందుకంటే పడి లేచిన కెరటంలా పూరీ జగన్నాథ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలని చూసాడు.ఎన్నో కోట్లు సంపాదించాడు అంతా పోగొట్టుకున్నాడు.

మళ్ళీ సంపాదించాడు మళ్ళీ పోగొట్టాడు.అందువల్లే ఆయనకు డబ్బు మీద వ్యామోహం లేదు.

అలాగే వాటిని దాచుకోవాలని కోరిక లేదు.అందుకే పూరీ జగన్నాధ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక భిన్నమైన వ్యక్తి.

Advertisement

కుక్కల్ని ప్రేమిస్తాడు మనుషులను అసహ్యించుకుంటాడు.డబ్బును విసిరేస్తాడు మంచితనాన్ని మాత్రమే పెంచుకుంటాడు.

ఇవి పూరీ జగన్నాథ్ లక్షణాలు.

పూరి జగన్నాథ్ గురించి అనేక ఆర్టికల్స్ ఇప్పటికే మనం చూసాం.అయితే ఆయన ఇంటికి కేవ్( CAVE ) అనే ఒక పేరు పెట్టుకున్నాడట.మరి ఆ పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ? ఆ పేరు వెనుక ఉన్న అర్థమేంటి ? ఆ పేరు ఎవరు పెట్టారు ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.పూరి జగన్నాథ్ ఎంతో ఇష్టపడి, కష్టపడి సినిమా ఆఫీసు కోసం అలాగే ఉండడానికి అని ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడట.

అయితే బిల్డింగ్ కొన్ని కారణాల చేత అమ్ముకోవాల్సి వచ్చింది అంట.అయినా కూడా ఆ ఇంటిపై ఎంతో ప్రేమ తో డబ్బు మళ్ళీ సంపాదించి అలాంటి ఇల్లు నే మళ్లీ కట్టుకున్నాడట.ఆ ఇంటి ఓపెనింగ్ కి రాంగోపాల్ వర్మ ను అని పిలిచాడు.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

వర్మ శిష్యుడే పూరి జగన్నాథ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఆ ఇంటిని చూసిన వర్మ ఈ ఇంటికి ఒక మంచి పేరు పెట్టు అన్నాడట.దాంతో పూరి జగన్నాథ్ నో మ్యాడ్ ( No Mad ) అనే ఒక పేరుని సజెస్ట్ చేశాడట.

Advertisement

అందుకు గల కారణం ఏంటంటే సంచార జీవితం చేసేవాళ్ళు ఒక పూట పడుకోవడానికి వేసుకునే ఒక టెంట్ లాంటిదే నా ఇల్లు అని ఇది ఎప్పుడు పోతుందో తెలియదు అని సరదాగా అన్నాడట.కానీ ఆ పేరు బాగాలేదని కేవ్ అనే ఒక పేరుని పెడుతున్నానని వర్మ చెప్పారట.

ఎందుకు ఆ పేరు పెడుతున్నారు అని పూరి అడిగితే ఆల్ ద కేవ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై టైగర్స్ అని ఇంగ్లీషులో చెప్పారట.అంటే అన్ని పులుల గుహాలలోనే ఉంటాయి అనే దాని అర్థం.

దీన్నిబట్టి ఆ ఇంటికి కేవ్ అనే పేరును ఎందుకు పెట్టాడో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు.

తాజా వార్తలు