సంక్రాంతి రోజు ఇంటి ముందు పాలు ఎందుకు పొంగిస్తారు?

సంక్రాంతి రోజు ఇంటి ముందు రంగవళ్లులు వేయడం.అందులో గొబ్బెమ్మలు పెట్టడం.

ఆ తర్వాత వాటిలో పాలు పొంగిచడం కొన్ని చోట్ల పరమాన్నం వండటం ఆనవాయితీగా వస్తోంది.

సంక్రాంతి పర్వ దినాన ఇంటి ముందు పాలు పొంగించడం వల్ల సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు పాలు పొంగినట్లు పొంగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

Why Pour Milk In Front Of The House On Sankranthi Day, Traditions, Hindus , San

అందుకే ఈ రోజు ఇంటి ముందు పాలు పొంగిస్తారు.అంతే కాదండోయ్ ఆ పాలలోనే కొందరు బియ్యం వేసి పరమాన్నం వండుతారు.

ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి పెడతారు.బొమ్మరిల్లు ఎందుకు కడతారుకొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో పుట్టమన్ను తీసుకొచ్చి బొమ్మరిల్లు కడతారు.

Advertisement

అందులోనే చిన్న కట్టెల పొయ్యిని కూడా ఏర్పాటు చేస్తారు.అందులో అలికి ముగ్గులు పెట్టి కాసేపు ఆరాకా… చిన్న కుండలో సంక్రాంతి రోజున పాలు పొంగిస్తారు.

అంతే కాదు మరి కొన్ని చోట్ల అదే చిన్న కుండలో పరమాన్నం కూడా వండుతారు.ఆ చిన్న కుండనే గురిగి అని కూడా అంటారు.

 ఈ సంప్రదాయం ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది.ఇప్పుడు దీనికి అంత ప్రాధాన్యత లేకపోయినా 1980 నుంచి 2000 వరకు పుట్టిన వాళ్లందరికీ ఈ విషయాలు బాగా తెలుస్తాయి.

ఎందుకంటే వీరందరూ ఆ బొమ్మరిల్లలో ఆడుకున్న వాళ్లే పాలు పొంగించి, పరమాన్నం వండిన వాళ్లే.ఇదే కాదండోయ్ ఈ తతంగం పూర్తయిన తర్వాత పతంగులు చేత పట్టుకొని ఎగురవేస్తూ ఒకరి వెనుక ఒకరు పరిగెత్తడం కూడా గుర్తంచుకోవాల్సిన విషయమే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025
Advertisement

తాజా వార్తలు