సినిమా వాళ్లు సమాజం ఎటుపోయినా పట్టించుకోరా.. సాయిధరమ్ తేజ్ ఒక్కడే రియల్ హీరో..?? 

ప్రణీత్ హన్మంతు( Praneeth Hanumanthu ) అనే యూట్యూబర్ "ఆన్‌లైన్ రోస్టింగ్" అనే ఓ సోషల్ ఫార్మాట్‌లో భాగంగా చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు.

ప్రణీత్ పవిత్రమైన బంధాన్ని షేర్ చేసుకునే తండ్రీకూతుర్లు, అమ్మ కొడుకుల పైన పిచ్చి కూతలు కూస్తుంటాడు.

ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చాలామంది డిమాండ్ చేస్తున్నారు.ఒక సమాజంలో విషాన్ని, అశ్లీలతను నింపే ఇలాంటి వారిని కఠినంగా శిక్షించకపోతే పెద్ద ప్రమాదమే అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీరిని ఊరికే వదిలేస్తే రోస్టింగ్ పేరిట ఏది మాట్లాడినా అది చెల్లిపోతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంటుంది.పసిపిల్లల మనుషులను మలినం చేసినట్టు కూడా అవుతుంది.

అయితే మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) మాత్రం ఇలాంటి వారిని చూస్తూ ఊరుకోలేదు.మృగాలే సిగ్గుపడేలాగా ఉన్న ఈ ఆన్‌లైన్ రోస్టింగ్( Online Roasting ) వీడియోపై ఇమీడియెట్‌గా రియాక్ట్ అయ్యాడు.

Advertisement

ఇలా తండ్రీ కూతుర్లపై నీచంగా మాట్లాడే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.ముఖ్యమంత్రిలను, డిప్యూటీ సీఎంలను ట్యాగ్ చేసి ఒక ట్వీట్ చేశాడు.

అతని తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, ఖుష్బూ, విష్వక్సేన్ కూడా దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

హీరో కార్తికేయ( Hero Karthikeya ) రియాక్ట్ అవుతూ "ఛీ ఇలాంటి చెత్త గాడికా నేను ఇంటర్వ్యూ ఇచ్చింది." అని చెంపలు వేసుకున్నాడు.ప్రణీత్‌ను హరోంహర సినిమాలో నటింపజేసినందుకు తాము ఎంతో సిగ్గుపడుతున్నామని సుధీర్ బాబు( Sudheer Babu ) పేర్కొన్నాడు.

ఈలోగా సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు ఇలాంటి అసహ్యకరమైన కామెంట్లు చేసే వారిపై తీవ్రంగా స్పందించారు.డీజీపీ కఠినమైన కేసు ఫైల్ చేయనున్నట్లు ఒక ట్వీట్ చేశారు.

అమానుషం.. బైక్ కు కుక్కను కట్టేసి ఏకంగా నడిరోడ్డుపై..?
జిమ్, సర్జరీ లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్.. ఎలా సాధ్యమైందంటే?

వీరందరూ వెంట వెంటనే స్పందించడంతో ఇలాంటి నీచులకు ఒక పాఠం నేర్పినట్లు అయ్యింది.

Advertisement

అయితే ఓన్లీ చిన్న హీరోలు మాత్రమే దీనిపై స్పందించడం, పెద్ద హీరోలు దీనిని పట్టించుకోకపోవడం ప్రస్తుతం పెద్ద చర్చినీయాంశంగా మారింది.స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ఆస్కార్లు విన్నర్లు ఇలాంటి వాటిపై రియాక్ట్ అయినట్లయితే ఈ సమస్య మరింత త్వరగా సమర్థవంతంగా, సాల్వ్ అయి ఉండేది.మళ్లీ ఇలాంటి పనిచేయడానికి వేరే వాళ్ళు భయపడి ఉండేవారు.

స్టార్ హీరోలు అంటే కేవలం సినిమాలో నటిస్తే సరిపోదు.సమాజంలో జరిగే చెడు పనులను ఖండించాలి.

వాటికి పరిష్కారం దొరికే లాగా వీరు తమ వంతు మాట్లాడాలి.ఎంతసేపూ ఫేక్ ఇమేజీ బిల్డప్పులు ఇచ్చుకోవడం వల్ల వారికే చెడ్డ పేరు వస్తుంది.

డబ్బులు, భజనలు తప్ప మరో ప్రపంచమే తమకు లేదన్నట్లు వీళ్ళు ప్రవర్తించకూడదు.మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఆన్‌లైన్ రోస్టింగ్ వ్యవహారాన్ని ప్రముఖ మీడియా సంస్థలు చాలా లైట్ తీసుకున్నాయి ఒక ఆంధ్రజ్యోతి మాత్రమే టాపిక్ గురించి ప్రయారిటీ ఇచ్చి చక్కగా ప్రచురించింది.

తాజా వార్తలు