Why Megastar took a serious class to Pawan?

అత్తారింటికి దారేది ముందువరకు పవన్ కళ్యాణ్ వేరు .అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్ వేరు .

ఎందుకో తెలియదు, సినిమా మీద భక్తిశ్రద్ధ తగ్గటినట్లుగా అనిపిస్తోంది.గోపాల గోపాల ఓ హిందీ చిత్రానికి రీమేక్ .ఏదో యావరేజ్ గా ఆడింది.మొహమాటం లేకుండా చెబితే సినిమాకి చిన్నిపాటి నష్టాలు కూడా వచ్చాయి.

ఇక సొంత కథంటూ రాసుకున్న సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టార్.అసలు అందులో కథ ఏముందో మన పవర్ స్టార్ కే తెలియాలి.

తాజాగా, కాటమరాయుడు.అరిగిపోయిన తమిళ సినిమా కథని తీసుకొచ్చే తెలుగు ప్రేక్షకుల మీద రుద్దే ప్రయత్నం చేసాడు పవన్ కళ్యాణ్.

Advertisement

ఏమైంది ? సినిమాకి యావరేజ్ టాక్ అయితే వచ్చింది కాని, ఈ సినిమాకి నష్టాలు రాకుండా ఆపడం పవన్ కి సాధ్యపడే విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా ఒకటి ఆసక్తకరంగా ఉంటే, ఆ తరువాత వేదాలం, తెరి సినిమాల రీమేక్ ప్లాన్ చేసుకున్నాడు పవన్.

కాని ఈ ప్లాన్ చిరంజీవికి చిరాకు తెప్పించిందట.అసలేమాత్రం పట్టింపు లేకుండా ఇలా రోటీన్ సినిమాలని రీమేక్ చేసుకుంటూ పోవడంలో అర్థం ఏమిటి ? అదికూడా డాలి, నీసన్, సంతోష్ శ్రీనివాస్ లాంటి దర్శకులతో అంటూ పవన్ ని గట్టిగా మందలించారట అన్నయ్య.చేసే సినిమాలు పట్టింపుతో చేయాలి, అక్కడ పంపిణీదారులు నష్టపోతున్నారు .ఎంత సినిమాలు మానేస్తున్నా, మరీ ఇంత అజాగ్రత్తగా ఉండటం ఏమిటి .నష్టాలు చూసేది నువ్వు కాదు కదా, బయట కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నారట మెగాస్టార్.ఆయనే వివి వినాయక్ ని పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపించారట కథ చెప్పమని.

వినాయక్ పవన్ కి ఓ లైన్ వినిపించారట.లైన్ అయితే పవన్ కి నచ్చింది కాని, దీన్ని బౌండెడ్ స్క్రిప్ట్ గా డెవలప్ చేస్తే అప్పుడు తన పూర్తి అభిప్రాయాన్ని చేబుతానని పవన్ చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం వినాయక్ ఆ లైన్ ని కథగా మార్చే పనిలో బిజీగా ఉన్నారు.అంతా ఓకే అయితే త్రివిక్రమ్ సినిమా తరువాత రీమేక్స్ కి బదులు వినాయక్ సినిమానే ఉంటుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
మరోసారి జనంలోకి జగన్.. కొత్త షెడ్యూల్ విడుదల..!!

ఈ ప్రాజెక్టుని బండ్ల గణేష్ నిర్మిస్తారు.

Advertisement

తాజా వార్తలు