సినిమా వర్క్స్ పూర్తయినా కూడా కల్కి ఎందుకు విడుదలకు నోచుకోవడం లేదు ?

ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కల్కి.( Kalki ) ఈ సినిమాలో దీపికా పదుకొనే తో పాటు దిశ పటాని సైతం హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 Why Makers Postponing Prabhas Kalki Release Details, Prabhas, Kalki Movie, Direc-TeluguStop.com

భారీ ఎత్తున బడ్జెట్ పెట్టి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా షూటింగ్ పూర్తి చేశాడు నాగ్ అశ్విన్.మరో రాజమౌళిలా మారిపోయి ఈ చిత్రాన్ని చాలా రోజులుగా చెక్కుతూనే ఉన్నాడు.

ఇప్పటికే ప్రభాస్ కి( Prabhas ) పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంత పాన్ ఇండియా స్టార్ డం ఉన్నా కూడా ఆయన సినిమాలు పెద్దగా విజయం సాధించడం లేదు.

అయితే నాగ్ అశ్విన్( Nag Ashwin ) లాంటి ఒక దర్శకుడు చేతిలో సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.మహానటి సినిమా విజయం తర్వాత నాగ్ అశ్విన్ పై అందరిలో నమ్మకం పెరిగింది.

Telugu Nag Ashwin, Disha Patani, Ipl Season, Kalki, Kalki Postpone, Prabhas-Movi

ఇక డబ్బుకు వెనకాడకుండా వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) వారు ఈ చిత్రాన్ని బాగానే గ్రాండియర్ గా రెడీ చేయించారు.అలాగే ఈ సినిమా విడుదల తేదీ మే 9 అంటూ ఊదర కొట్టేశారు.పైగా ఈ డేట్ అందరికి అచ్చచ్చిన డేట్ అని బాగా కలెక్షన్స్ వస్తాయని కూడా అందరి నమ్మకం.అన్ని సిద్ధంగానే ఉన్న ఈ డేట్ కి సినిమా విడుదల కావడం లేదు అనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం.

మరి పూర్తిస్థాయి చిత్రం రెడీగా ఉన్న విడుదలకు ఎందుకు నోచుకోవడం లేదంటే దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.మొదటి కారణం విద్యార్థుల పరీక్షలు.మే నెల మధ్య వరకు పిల్లలకు పరీక్షలు ఉండడంతో చాలామంది ఈ సినిమా చూడడానికి ముందుకు రారేమో అనే భయం ఉంది.పైగా సమ్మర్ హీట్ ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు తోడవుతుంది.

Telugu Nag Ashwin, Disha Patani, Ipl Season, Kalki, Kalki Postpone, Prabhas-Movi

మరోవైపు ఐపీఎల్ సీజన్( IPL Season ) కూడా ఈ సమ్మర్ సీజన్ పై గట్టిగానే దెబ్బ కొడుతోంది.అలాగే ఎలక్షన్స్( Elections ) కూడా భారీ తేడాకి కారణం అవుతున్నాయి.దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ నగరా మోగిన తర్వాత చాలామంది యువత రాజకీయాలతో బిజీగా ఉన్నారు.వీరంతా సినిమా థియేటర్ కి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మేకర్స్ నమ్ముతున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే టికెట్ రేట్ విషయంలో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాతలకి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందట.మరోవైపు థియేటర్స్ లో టికెట్స్ రేట్లు పెంచడానికి అధికారుల అనుమతి కంపల్సరీ.

కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వారెవరు కూడా మేకర్స్ కి అందుబాటులో లేరు.దాంతో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే ఈ విషయం గురించి అధికారులతో మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

ఇలా ఎన్ని కారణాల మధ్య కల్కి సినిమా విడుదల ఆలస్యం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube