టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ను అంతర్జాతీయ స్థాయి లో ప్రమోట్ చేసే విషయంలో బిజీగా ఉన్నాడు.ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు ఆస్కార్ ను కూడా ముద్దాడటం కన్ఫర్మ్ అన్నట్లుగా అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
రాజమౌళి ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన భవిష్యత్తు సినిమాల గురించి మాట్లాడటం జరిగింది.
అదే సమయంలో మహేష్ బాబు తో తన తదుపరి సినిమా ఉండబోతుంది అంటూ ఆయన పేర్కొన్నాడు.
రాజమౌళి ఇంకా మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితమే మహేష్ బాబు తో సినిమాను చేయాల్సి ఉంది.కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చిందని.
ముందు ముందు మహేష్ బాబు తో ఒక భారీ యాక్షన్ అడ్వంచర్ సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

బాహుబలి సినిమాకు ముందు మహేష్ బాబుతో సినిమా అనుకున్నప్పటికి అప్పటికి ఉన్న పరిస్థితుల కారణంగా ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.బాహుబలి సినిమాకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను.ఆర్ఆర్‌ఆర్ సినిమా కు ముందు కూడా మహేష్ బాబు తో సినిమా అనుకున్నాను.
కానీ మల్టీ స్టారర్ ఐడియా రావడంతో మహేష్ బాబు సినిమాను మరి కొంత కాలం వాయిదా వేయడం జరిగింది.

ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేసి తీరుతాను అన్నట్లుగా రాజమౌళి గంట కొట్టినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.మహేష్ బాబు తో సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటీ అనేది క్లారిటీ ఇవ్వలేదు.పదేళ్ల పాటు సినిమా వాయిదా పడుతూ వస్తున్నా కూడా ఎప్పుడు వచ్చినా కూడా జక్కన్న మార్క్ తో అద్భుతంగా ఉండటం కన్ఫర్మ్.
మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఆలస్యం అవ్వడమే మంచిది అయ్యిందని.ఇప్పుడు సినిమా స్థాయి భారీగా ఉంటుంది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







