కొంత మంది డైరెక్టర్స్ వాళ్ళు తీసే సినిమాల్లో పెద్దగా మాటర్ లేకపోయినా ఏదో అలా ఊపులో నడిచేస్తు ఉంటాయి.కానీ మరీ కొందరు డైరెక్టర్స్ చేసే సినిమాలు మాత్రం చాలా బాగుంటాయి అయిన కూడా పెద్దగా గుర్తింపు రాదు…ఇదంతా ఎందుకు చెప్తున్న అంటే అప్పుడెప్పుడో వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమా( Oh my friend movie )తో డైరెక్టర్ అయిన వేణు శ్రీరామ్( Venu Sriram ) ఆ సినిమాతో ప్లాప్ డైరెక్టర్ గా మారాడు.
ఆ తరువాత నాని( Nani ) హీరోగా ఎంసిఏ సినిమా( MCA movie ) చేసి యావరేజ్ టాక్ తెచ్చుకున్నాడు.ఇక ఆ తరువాత మళ్ళీ చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని రీమేక్ చేస్తూ తెలుగులో వకీల్ సాబ్ అనే సినిమా చేశాడు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికి ఆయనకి ఏ హీరో దగ్గరి నుండి కూడా అవకాశం రావడం లేదు ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా వచ్చి 2 సంవత్సరాలు గడిచిన కూడా ఇంకా ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.
ఇప్పటికీ ఆయన దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉంటూ ఏ హీరో అవకాశం ఇస్తాడా అని ఆశతో ఎదురుచూస్తున్నాడు.అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడు అనే టాక్ వినిపించినప్పటికి అవి మాటల వరకే పరిమితం అవుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ కి డేట్స్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి పాన్ ఇండియా
డైరెక్టర్స్ తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అందులో భాగం గానే ఆయన సందీప్ రెడ్డి వంగ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్ తో ఒక సినిమా ఉంటుందని ఈ మధ్యే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.ఇక వేణు శ్రీరామ్ ఇప్పుడు సినిమా చేయాలంటే సెకండ్ గ్రేడ్ హీరోలు డేట్స్ ఇవ్వాల్సిందే తప్ప స్టార్ హీరో లు ఎవరు ఇచ్చే పొజిషన్ లో లేరు ఎందుకంటే ఇప్పటికే అందరూ చాలా సినిమాలు కమిట్ అయిపోయి ఉన్నారు… చూడాలి మరి వేణు శ్రీరామ్ కి అవకాశము ఇచ్చే హీరో ఎవరో అనేది.