టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరో గా ఎదిగిన నటులలో ఒకడు రాజశేఖర్( Rajasekhar ).కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన ఈయన, ఆ తర్వాత హీరో గా ఎన్నో అవకాశాలను సంపాదించి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి దక్కించుకున్నాడు.
ఆయనతో పాటు ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోలు, ఆయన తర్వాత ఇండస్ట్రీ కి వచ్చిన హీరోలందరూ, ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టులుగా మరియు విలన్స్ గా మారితే, రాజశేఖర్ మాత్రం ఇప్పటీకీ హీరోగానే కొనసాగుతున్నాడు.విజయ శాంతి( Vijaya Shanti ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ప్రతి ఘటన’ అనే చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాజశేఖర్, ఆ తర్వాత మళ్ళీ విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వందే మాతరం’ అనే చిత్రం తో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
అలా వరుసగా హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనాగుతూ వచ్చిన రాజశేఖర్ కెరీర్ కి పెద్ద యూ టర్న్ లాంటి సినిమా ‘అంకుశం’.
ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ ఒకానొక సమయం లో మెగాస్టార్ చిరంజీవి కి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని ఇచ్చిన హీరో గా నిలిచాడు రాజశేఖర్.అలా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజి ఉన్న రాజశేఖర్ కి ఒక రొమాంటిక్ హీరో గా మార్చి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు.వీళ్లిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ అనే చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి, సంవత్సరం రోజులకు పైగా థియేటర్స్ లో ఆడింది.ఈ సినిమాలోని పాటలు ఇప్పటీకీ ఫేమస్.
గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘వేటగాడు’ అనే చిత్రం వచ్చింది, హిందీ లో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘భాజీఘర్’ అనే చిత్రానికి ఇది రీమేక్,ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.
అయితే తనకి అల్లరి ప్రియుడు లాంటి సెన్సషనల్ హిట్ ఇచ్చిన రాఘవేంద్ర రావు తో రాజశేఖర్ అప్పట్లో గొడవలకు దిగాడు, ఒక్కమాటలో చెప్పాలంటే రాఘవేంద్ర రావు ని కొట్టడానికి వెళ్ళాడు అని అనాలి.అప్పట్లో చెన్నై లో ఉన్నప్పుడు రాఘవేంద్ర రావు గారిని జీవిత మరియు రాజశేఖర్ తరచూ కలిసేవారట.వీళ్ళతో పాటు జీవిత చెల్లెలు కూడా వచ్చేది.
ఈ అమ్మాయి చాలా అందం గా ఉంది, సినిమాల్లో నటింపచేయండి, పెద్ద ఆర్టిస్త్ అవుతుంది కచ్చితంగా అని జీవిత తో చెప్పేవాడట.అయితే ఎవరి ద్వారానే జీవిత చెల్లెలు ఫోన్ నెంబర్ రాఘవేంద్ర రావు కి దొరికింది.
ఆమెకి ఫోన్ చేసి ఇలా సినిమాల్లో నటించొచ్చు కదా ఎందుకు సమయం వృధా చేస్తున్నావు అంటూ తరచూ ఫోన్లు చేసేవాడట, ఇది తెలుసుకున్న రాజశేఖర్ నా మరదలితోనే రహస్యం గా మాట్లాడుతావా అంటూ గొడవ దిగ్దత రాజశేఖర్.ఆ తర్వాత అసలు నిజం తెలుసుకొని క్షమాపణలు కూడా చెప్పాడట.
కానీ రాఘవేంద్ర రావు మాత్రం రాజశేఖర్ ని క్షమించలేదు, ఇప్పటీకీ వీళ్లిద్దరి మధ్య మాటలు లేవు.